తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆ డైరెక్టర్‌ నన్ను శృంగార బానిసగా చూశాడు' : నటి సంచలన ఆరోపణలు - Hema Committee Report - HEMA COMMITTEE REPORT

Hema Committee Report : ఒక దర్శకుడిని ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు నటి సౌమ్య. ఆ దర్శకుడు తనను ఒక శృంగార బానిసగా చూశాడని పేర్కొన్నారు. పూర్తి వివరాలు స్టోరీలో

source Getty Images
Hema Committee Report (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2024, 4:03 PM IST

Hema Committee Report Actress Sowmya : ప్రస్తుతం హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా కోలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఒక డైరెక్టర్‌ను ఉద్దేశించి నటి సౌమ్య సంచలన ఆరోపణలు చేశారు. ఆ డైరెక్టర్‌ తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని పేర్కొన్నారు. తనను కూతురు అని పిలుస్తూనే చాలా నీచంగా ప్రవర్తించాడని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Actress Sowmya Sex Allegations :"సినిమాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచే ఎన్నో కలలు కన్నాను. 18 ఏళ్ల వయసులో తెలిసిన వారి ద్వారా మూవీ ఛాన్స్ వచ్చింది. దర్శకుడు నచ్చ జెప్పాడని ఇంట్లో వాళ్లు కూడా సరే అన్నారు. అయితే తొలి మీటింగ్‌లోనే అతడి ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. కొంత కాలానికి అతడు నాతో నీచంగా, అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. తన భార్య పక్కన లేనప్పుడల్లా నాపై అత్యాచారానికి పాల్పడేవాడు. అలా దాదాపు ఏడాది పాటు ఇలానే చేశాడు." అని ఆరోపణలు చేశారు నటి సౌమ్య.

ఆ దర్శకుడు తనను ఒక శృంగార బానిసగా చూశాడని పేర్కొన్నారు సౌమ్య. తన బాధను ఎవరితోనూ చెప్పలేక పోయానని ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ డైరెక్టర్‌ పేరు మాత్రం సౌమ్య చెప్పలేదు. ప్రస్తుతం హేమ కమిటీ రిపోర్ట్ ఆధారంగా మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించి వేధింపుల కేసులను ఇన్‌వెస్టిగేషన్‌ చేస్తున్న ప్రత్యేక బృందానికి మాత్రమే అతడికి సంబంధించిన వివరాలను తెలియజేస్తానని చెప్పారు.

కాగా, దాదాపు ఏడేళ్ల పాటు దర్యాప్తు చేసి జస్టిస్‌ హేమ కమిటీ నివేదికను సిద్ధం చేశారు. మాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్‌, వివక్ష, ఇతర సమస్యలు, ఇబ్బందికర పరిస్థితులపై అధ్యయనం చేసిన కమిటీ ఈ రిపోర్ట్‌ను సమర్పించింది. ఇంకా మహిళల వర్కింగ్‌ కండిషన్లు, రెమ్యునరేషన్‌, టెక్నికల్‌ విభాగంలో మహిళల భాగస్వామ్యం సహా పలు అంశాలను కూడా అధ్యయనం చేశారు. దీంతో ఆ నివేదిక గత కొద్ది రోజులుగా వివాదస్పదంగా మారింది.

'సింబా'పై ప్రశాంత్ వర్మ మరో సూపర్ అప్డేట్‌ - నందమూరి ఫ్యాన్స్‌లో పెరిగిన జోష్‌ - Prasanth Varma Mokshagna

సాఫ్ట్​వేర్ ఎంప్లాయ్​ టు మిస్​ కర్ణాటక- మోడలింగ్​లో KGF బ్యూటీ జర్నీ ఇలా! - Srinidi Shetty

ABOUT THE AUTHOR

...view details