Happy Days Re Release:నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హ్యాపీ డేస్. 2007లో విడుదలైన ఈ చిత్రం యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్‌గా ప్రేక్షకులని అలరించింది. ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుని సంచలనం సృష్టించింది. వరుణ్ సందేశ్, తమన్నా , నిఖిల్ సిద్ధార్థ్ వంటి న్యూ కమ్మర్స్‌తో దర్శకుడు శేఖర్ కమ్ముల వెండితెరపై మ్యాజిక్ చేశారు.
శేఖర్ కమ్ముల అద్భుతమైన డైరెక్షన్, నటీనటులు పెర్ఫార్మెన్స్, మిక్కీ జే మేయర్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ప్రేక్షకుల మనసులో ఈ సినిమాను ఎవర్ గ్రీన్‌గా నిలిపింది. అయితే యూత్ ఫుల్ చిత్రాలలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ హ్యాపీ డేస్ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏప్రిల్ 19న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ సినిమా రీ రిలీజ్ గురించి ఇందులో నటించిన హీరోకే తెలియదంట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే?
టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన 'శబరి' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు యంగ్ హీరో వరుణ్ వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ క్రమంలో 'హ్యాపీడేస్ రీ రిలీజ్‌ను థియేటర్లో చూడాలనుకుంటున్నారా?' అని ఓ విలేకరి ప్రశ్నించారు. అప్పుడు తనకేమి తెలియదన్నట్లు వరుణ్ ఉండిపోయారు. దీంతో వరుణ్ సందేశ్ కీలక పాత్రలో నటించిన సినిమా రీ రిలీజ్ గురించి అతడికే తెలియదా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.