Happy Birthday Rashmika Mandanna :కిరిక్ పార్టీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అనంతరం ఛలోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై పుష్ప శ్రీవల్లితో నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకుంది రష్మిక. కోలీవుడ్‌లోనూ కార్తి, విజయ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే నేడు ఈ భామ పుట్టినరోజు సందర్భంగా రష్మిక లగ్జరీ లైఫ్, రెమ్యునరేషన్ సహా ఇతర ఆసక్తికర విషయాలకొస్తే.. రష్మిక చిన్నతనంలో తన తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి ఎలాగైనా కుటుంబ పరిస్థితిని మార్చాలని అనుకుందట. అందుకే లైఫ్‌లో ఎలాగైనా ఉన్నత స్థాయికి ఎదగాలని బలంగా నిర్ణయించుకుందట. అందుకు తగ్గట్టే ప్రస్తుతం లైఫ్‌లో ముందుకెళ్తూ తాను సంపాదించిన మొత్తంలో చాలా వరకు తన తండ్రికే ఇస్తుందట.
రష్మిక తన తొలి చిత్రానికి రూ. 1.50 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందని తెలిసింది. అనంతరం ఛలో సినిమాకు రూ. 50 లక్షల వరకు అందుకుందని సమాచారం. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా మారాక ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. యానిమల్ సినిమాకు రూ. 7 కోట్లు తీసుకుందని ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది
ప్రస్తుతం సినిమా రెమ్యునరేషన్‌తో పాటు ఆమె పలు ప్రకటన ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఒక్కో ప్రకటనకు డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. అలా ప్రస్తుతానికి ఆమె రూ. 70 కోట్ల వరకు సంపాధించినట్లు ఇంగ్లీష్ కథనాల్లో రాసి ఉంది.