Hanuman Movie Records : దాదాపు రూ.30కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్ సినిమా ఈ సంక్రాంతి బరిలో పెద్ద బడ్జెట్ సినిమాలతో పోటీ పడి మరీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తేజ సజ్జాకు అంతకుముందే జాంబీ రెడ్డి, అధ్బుతం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు వచ్చినా ఈ సినిమా అతన్ని హీరోగా నిలబెట్టింది. అదే సమయంలో భారీ వసూళ్లను సాధించి పెట్టిన బడ్జెట్‌కు ఏడింతలు లాభాల్ని తెచ్చిపెట్టింది.
అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర గతేడాది భారీ బడ్జెట్ చిత్రంగా వచ్చిన ప్రభాస్ ఆది పురుష్ను మించిపోయింది హనుమాన్. ఆదిపురుష్ రూ.550 కోట్ల బడ్జెతో తెరకెక్కి రూ. 393 కోట్లు కలెక్షన్ సాధించింది. అంటే 150 కోట్లు నష్టపోయింది. ఓవర్సీస్లో రూ. 50 కోట్లు సంపాదించింది. కానీ హనుమాన్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపు దాదాపు 293కోట్లు కలెక్షన్లను సంపాదించింది. ఓవర్సీస్లో రూ. 56 కోట్లు ఖాతాలో వేసుకుంది. రీసెంట్‌గానే ఓ అవార్డును కూడా అందుకుంది.
ఇక థియేటర్లలో సంచలనం సృష్టంచిన ఈ చిత్రం ఓటీటీలోనూ సెన్సేషనల్ రికార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో 207 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటేసింది. ఐదు రోజుల్లోనే ఈ ఘనతను సాధించించడ విశేషం. ఇక హిందీ వెర్షన్ మార్చి 16న జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ అవ్వగా అప్పటి నుంచి అక్కడ కూడా టాప్‍లోనే ట్రెండ్ అవుతోంది. భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వట్లేదు.