Hanuman Movie Ayodhya Donation :'హను-మాన్' మూవీ మేకర్స్ తాము ఇచ్చిన మాట మరోసారి నిలబెట్టుకున్నారు. ప్రతి సినిమా టికెట్‌పై రూ. 5ను రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. అలా ప్రీమియర్ షోల నుంచి వచ్చిన 2,97,162 టిక్కెట్లకు గాను రూ.14,85,810 చెక్కును ఇప్పటికే డొనేషన్ రూపొంలో అందించారు. అయితే ఇప్పటి వరకూ 53,28,211 టికెట్లు అమ్ముడవ్వగా, వాటి ద్వారా వచ్చిన రూ.2,66,41,055ను విరాళంగా ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Hanuman Movie Overseas Collection : మరోవైపు ఈ సినిమా అటు ఇండియాతో పాటు ఓవర్సీస్లోనూ దూసుకెళ్తోంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఈ మూవీ 3 మిలియన్ మార్క్ దాటగా, తాజాగా నాలుగు మిలియన్ల మార్క్ దాటి రికార్డులు క్రియేట్ చేస్తోంది. అలా ఆల్ టైమ్ హైయ్యెస్ట్ తెలుగు గ్రాసర్ మూవీస్ లిస్ట్‌లోకి చేరింది.
ఇక తాజాగా నటుడు నాగచైతన్య 'హనుమాన్' మూవీ టీమ్‌పై ప్రశంసల జల్లును కురిపించారు. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ఆయన ట్విట్టర్ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. అలా హీరోతో పాటు మిగతా టీమ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
"హను-మాన్‌తో బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అభినందనలు. స్టోరీ, దాన్ని స్క్రీన్‌పైకి తీసుకువచ్చిన తీరు అద్భుతం. ఈ చిత్రం ఆద్యంతం నీ యూనివర్స్‌లో నేను లీనమయ్యాను. హనుమంతుగా తేజ సజ్జా అద్భుతమైన నటన కనబరిచాడు. మూవీ టీమ్‌కు నా అభినందనలు" అని చైతూ పేర్కొన్నారు.
Hanuman Movie Cast :ఇక సినిమ విషయానికి వస్తే - ఈ సినిమాలో తేజతో పాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీ రోల్స్‌లో నటించారు. వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిర్మాత నిరంజన్‌రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.