తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ది గోట్: డ్యుయెల్ రోల్​లో విజయ్- డూప్​గా నటించింది ఇతడే? - Goat Movie

Goat Movie Vijay Dual Role: తలపతి విజయ్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'ది గోట్' సినిమాలో ఆయన డ్యూయెల్ రోల్​లో కనిపించారు. ఇక్కడే ఉంది ట్విస్ట్. విజయ్‌లా కనిపించిన ఆ యంగ్ క్యారెక్టర్ పోషించింది విజయ్ కాదట. మరి ఆ నటుడు ఎవరంటే?

Goat Movie Vijay Dual Role
Goat Movie Vijay Dual Role (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 8:11 PM IST

Goat Movie Vijay Dual Role:'ది గోట్' సినిమా భారీ బడ్జెట్, అంచనాలతో తెరకెక్కింది. ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ డ్యూయెల్ రోల్ కనిపించారు. ఫస్ట్​హాఫ్ మొత్తం విజయ్ కనిపిస్తే, సెకండాఫ్ అంతా ఆయన యంగ్ వర్షన్ కనిపిస్తుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందరూ చూపించినట్లుగా కాకుండా విజయ్ యంగ్ వర్షన్ కోసం ప్రత్యేకమైన ఫీట్ చేశారు.

మేకప్ వేసి విజయ్ ఏజ్ తగ్గిపోయింది అని మోసం చేయలేదు. ఏఐ (AI) టెక్నాలజీతో ప్లాన్ చేసి యంగ్ విజయ్‌ను చూపించారు. సెకండాఫ్‌లో వచ్చిన విజయ్ క్యారెక్టర్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. నిజంగా విజయ్‌లా కనిపించిన ఆ పాత్రను పోషించింది విజయ్ కాదట. కోలీవుడ్ ఆర్టిస్ట్ అయాజ్ ఖాన్ ఆ పాత్ర పోషించారట. కానీ, మనకు తెరపై కనిపించేది మాత్రం విజయ్‌నే.

అలా కనిపించే అవకాశం కల్పించినందుకు డైరెక్టర్ వెంకట్ ప్రభు, విజయ్‌తో పాటు టీమ్ అందరికీ అయాజ్ కృతజ్ఞతలు తెలిపారు. అయాజ్ గతంలో ఎటువంటి పెద్ద సినిమాల్లో నటించలేదు. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ తన నటనా నైపుణ్యాన్ని కనబరుస్తుంటారు. సోషల్ మీడియా వరకూ మాత్రమే సెలబ్రిటీ అయిన అయాజ్, ది గోట్ సినిమా తర్వాత సిల్వర్ స్క్రీన్ సెలబ్రిటీ కూడా అయిపోయారు. రీసెంట్‌గా మీడియా ఛానెల్స్‌కు ఇంటర్యూలిస్తూ బిజీగా మారిపోయారు.

కాగా, భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించారు. ఇతర పాత్రల్లో స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జయరామ్, మోహన్‌లు నటించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందించగా, దీనికి సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు.

కలెక్షన్లు
రూ.400 కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6500 స్క్రీన్లలో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో 250కు సెంటర్లలో రిలీజ్ అయిన సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు తమిళంలో 40 కోట్లు, తెలుగులో 3 కోట్లు, హిందీలో 2 కోట్లు, కన్నడలో 3 కోట్లు, కేరళలో కోటి, ఇతర రాష్ట్రాల్లో కోటి రూపాయల కలెక్షన్లతో నికర వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లోనూ దూసుకెళ్తూ బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ సాధించింది. అమెరికా, యూకే, ఇతర దేశాల్లో కలిపి 5 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు సాధించింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు తొలి రోజు రూ.126 కోట్లు, రెండో రోజు రూ.176 కోట్లు వసూలు చేసింది.

'ది గోట్' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ అఫీషియల్ డీటెయిల్స్​ - ఏకంగా ఎంత వసూలు చేసిందంటే? - The GOAT First Day Collections

ఫ్యాన్స్​కు దళపతి 'డబుల్' ట్రీట్ - 'ది గోట్' ఎలా ఉందంటే? - Vijay The Goat Movie Telugu Review

ABOUT THE AUTHOR

...view details