తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

లేటెస్ట్​ సినిమాల్లో 3 కామన్ పాయింట్స్​- తెలిస్తే షాకే! - Vishwak Sen GANGS OF GODAVARI - VISHWAK SEN GANGS OF GODAVARI

Vishwak Sen Gangs Of Godavari : 'గ్యాంగ్స్ ఆఫ్​ గోదావరి', 'గం గం గణేశా', 'భజే వాయు వేగం' ఇలా ఈ శుక్రవారం (మే 31) మూడు సినిమాలు థియేటర్లలో రిలీజై సందడి చేస్తున్నాయి. అయితే ఈ చిత్రాలకు సంబంధించిన మూడు కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే?

VISHWAK SEN GANGS OF GODAVARI
VISHWAK SEN GANGS OF GODAVARI (ETV Bharat Archives)

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 2:07 PM IST

Vishwak Sen Gangs Of Godavari : ప్రతి వారంలాగే ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద ముగ్గురు యంగ్ హీరోల సినిమాలు సందడి చేస్తున్నాయి. విశ్వక్ సేన్, ఆనంద్ దేవరకొండ, కార్తికేయ తమ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చారు. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూడు చిత్రాలు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అందులో ఒకటేమో హిట్​ టాక్ అందుకోగా, మిగతా రెండూ మిక్స్​డ్​ టాక్​తో నడుస్తోంది.

అయితే తాజాగా నెటిజన్లు ఈ మూడు సినిమాలకు సంబంధించిన కామన్ పాయింట్స్​ను కనిపెట్టారు. మూడింటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ పోలికలను వెతికి వాటిని ట్రెండ్ చేస్తున్నారు. అవేంటో చూసేద్దామా?

మొదటిది ఏంటంటే ఈ మూడు సినిమాల్లోనూ బ్లాక్ మనీకి సంబంధించిన పలు సీన్స్ ఉన్నాయి. అంతే కాకుండా అందులోని కొన్ని సన్నివేశాలు కూడా ఆ పాయింట్ చుట్టే నడుస్తాయట.

రెండో విషయం ఏంటంటే ఈ చిత్రాల్లో హీరోలకు మధ్య కూడా ఓ కామన్ పాయింట్ ఉంది. లీడ్​ రోల్స్ ముగ్గురూ కూడా అనాథలుగానే కనిపించారు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో విశ్వక్ సేన్​ తన తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోవడం వల్ల అనాథగా మారుతాడు. పెద్దయ్యాక చిన్నపాటి దొంగతనాలు చేస్తూ అదే ఊరిలో ఉంటాడు. 'భజే వాయు వేగం'లోనూ కార్తికేయ కూడా అనాథే. అంతే కాకుండా అతడు పెద్దయ్యాక ఓ కారును దొంగలించే ప్లాన్​లో భాగమవుతాడు. ఇదిలా ఉండగా, 'గం గం గణేశా'లో ఆనంద్ దేవరకొండ కూడా ఆ మూవీలో అనాథగానే కనిపిస్తాడు. అంతే కాకుండా ఓ డైమండ్ దొంగగానూ సినిమాల్లో కనిపిస్తాడు.

ఇక ఫైనల్‌గా ఈ మూడు సినిమాలకు సంబంధించిన అసలైన కోయిన్సిడెన్స్ ఏంటంటే, 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రొడ్యూసర్ పేరు నాగ వంశీ, 'భజే వాయు వేగం' ప్రొడ్యూసర్ పేరు యూ.వీ వంశీ, ఇక 'గం గం గణేశ' ప్రొడ్యూసర్ పేరు కారుమంచి వంశీ. ఇలా ఈ మూడు చిత్రాల నిర్మాతల పేర్లు కూడా భలేగా కలిశాయి.

గ్యాంగ్స్​ ఆఫ్ గోదావరి - తొలిరోజు ఎన్ని కోట్లంటే?

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి - ఎరుపెక్కిన గోదావ‌రి - Gangs Of Godavari Review

ABOUT THE AUTHOR

...view details