తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'గేమ్​ఛేంజర్' అరుదైన ఘనత- ఆ విషయంలో ఫస్ట్ ఇండియన్ మూవీ ఇదే! - GAME CHANGER PRE RELEASE

భారతీయ సినీఇండస్ట్రీలో తొలి సినిమా- గేమ్​ఛేంజర్ అరుదైన ఘనత

Game Changer
Game Changer (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2024, 7:43 PM IST

Game Changer Pre Release Event: గ్లోబల్ స్టార్ రామ్​చరణ్- శంకర్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. 2025 జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ వైపు శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా, మరోవైపు ప్రమోషన్స్​తోనూ సందడి చేస్తోంది. ఇటీవల టీజర్ లాంఛ్​ ఈవెంట్​ గ్రాండ్​గా జరగ్గా, మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేన్ అనౌన్స్​ చేశారు. ఈ నేపథ్యంలో 'గేమ్​ఛేంజర్' తొలి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించనుంది. మరి అదేంటంటే?

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​ను అమెరికాలో గ్రాండ్​గా నిర్వహించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. టెక్సాస్​లోని కర్టిస్ కల్వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్ గార్లాండ్ TX 75040లో ఈవెంట్ జరగున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న తొలి భారతీయ సినిమాగా 'గేమ్​ఛేంజర్' అరుదైన ఘనత సాధించనుంది. ఈ మేరకు మేకర్స్​ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. దానికి 'అమెరికాలో మెగా మాస్ ఈవెంట్​' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. కాగా, ఈ ఈవెంట్​కు హాజరు కానున్న గెస్ట్​ల గురించి తెలియాల్సి ఉంది.

ఇక సినిమా విషయానికొస్తే, సీనియర్ డైరెక్టర్ శంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్​చరణ్ డ్యుయెల్ రోల్​లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. సీనియర్ నటులు యస్​ జే సూర్య, అంజలీ, శ్రీకాంత్ తదితరులు ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందించారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు భారీ బడ్జెట్​తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించారు.

RC 16 Update :రామ్‌ చరణ్‌ హీరోగా 'ఉప్పెన్' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా అప్డేట్ వచ్చింది. దీపావళి సందర్భంగా మేకర్స్​ అప్టేట్ ఇచ్చారు. RC 16 వర్కింగ్ టైటిల్​తో ఇది తెరకెక్కనుంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్​గా నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్​పై సినిమాను నిర్మించనున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ త్వరలోనే ప్రారంభం కానుందని చిత్రబృందం తాజాగా అనౌన్స్ చేసింది.

ట్రెండింగ్​లో 'గేమ్​ఛేంజర్' టీజర్ - 24గంటల్లోనే 55 మిలియన్ వ్యూస్!

'నన్ను ఎవరూ అంచనా వేయలేరు' - రామ్‌చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్' టీజర్‌ వచ్చేసిందోచ్

ABOUT THE AUTHOR

...view details