Game Changer Day 1 Collection :కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైంది. అయితే తాజాగా ఈ మూవీ తొలిరోజు కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా సుమారు రూ.186 కోట్లు వసుళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపింది.
మరోవైపు ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో 'గేమ్ ఛేంజర్'కు తొలి రోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు ఆ సంస్థ వెల్లడించింది. వారాంతంలో ఈ టికెట్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆ రెస్పాన్స్ చూసి సంతోషంగా ఉంది : మెగాస్టార్ చిరంజీవి
మరోవైపు ఈ సినిమాలో అప్పన్న క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందులో చెర్రీ నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు ఆ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సెలబ్రిటీలు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ తండ్రి మెగా స్టార్ చిరంజీవి కూడా చెర్రీని పొగడ్తలతో ముంచెత్తారు.