Gadar 2 Telugu Tv Premiere : ప్రతిరోజు టీవీలో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. ప్రేక్షకులను మరింత అలరించేందుకు వీకెండ్‌లో కొత్త సినిమాలు కూడా ప్రసారమవుతుంటాయి. అలా ఇప్పుడు రూ.600కోట్ల బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ టీవీ ప్రీమియర్స్‌కు రెడీ అయింది. వివరాల్లోకి వెళితే. గత ఏడాది బాలీవుడ్ కమ్ బ్యాక్ భారీ లెవల్లో జరిగింది. జనవరి నుంచే పఠాన్‌తో మొదలై ఆ తర్వాత పలు చిత్రాలు మంచి హిట్‌గా నిలిచాయి. అందులో రెండు ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉండటం విశేషం. అలా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపిన చిత్రాల్లో గదర్ 2 కూడా ఒకటి. బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీదేఓల్ నటించిన ఈ చిత్రం గతేడాది ఇండియా వైడ్‌గా అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ ఫైవ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించి బాలీవుడ్ సినీ హిస్టరీలో అత్యధిక వసూళ్లను అందుకున్న ఎనిమిదో చిత్రంగా భారీ రికార్డ్‌ను క్రియేట్ చేసింది.
రూ. 60కోట్ల బడ్జెట్‌తో రూ. 691 కలెక్షన్లు
కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం టోటల్ థియేట్రికల్ రన్ టైమ్‌లో రూ. 691 కోట్లకుపైగా కలెక్షన్లను అందుకుంది. నిర్మాతలకు ఈ మూవీ పదింతల లాభాలను తెచ్చిపెట్టింది. తొలి రోజే ఈ చిత్రానికి రూ. 40 కోట్లు రాగా ఫస్ట్ వీకెండ్‌లో రూ. 134 కోట్ల కలెక్షన్స్‌తో లాభాల్లోకి అడుగుపెట్టేసింది. అలా మొత్తం రూ.700కోట్ల వరకు అందుకుంది.