తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఒకే పాటలో దుమ్ములేపిన ఐదుగురు స్టార్​ హీరోలు - ఎవరెవరు? ఏ సినిమా? - మీకు తెలుసా? - Five Heros Dance in One Song - FIVE HEROS DANCE IN ONE SONG

Five Heros Dance: సినిమాలో తమ అభిమాన హీరో సాంగ్​ ప్లే అవుతుంటే.. ఫ్యాన్స్ ఆనందంతో చిందులేస్తారు. అలాంటిది ఒకే పాటలో ఐదుగురు స్టార్​ హీరోలు కనిపిస్తే ఎలా ఉంటుంది? అలాంటి సాంగ్​ ఒకటి ఉంది! మరి.. అది ఏ సినిమా? ఆ స్టార్లు ఎవరు? అన్నది మీకు తెలుసా? ఆ వివరాలేేంటో ఇప్పుడు చూద్దాం..

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 9:43 AM IST

Five Heros Dance in One Song from Vajrakaya Movie: సినిమాకు కథ ఎంత ఇంపార్టెంటో.. పాటలు కూడా అంతే. కేవలం పాటలతో సూపర్​ హిట్​ అందుకున్న చిత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే.. హీరో ఇంట్రడక్షన్​ సాంగ్​లో.. ఆ చిత్రంలో నటిస్తున్న హీరో మాత్రమే కనిపిస్తారు. కానీ.. చాలా అరుదుగా మాత్రమే ఇతర హీరోలు క్యామియో రోల్ ప్లే చేస్తుంటారు. అలాంటి ఓ సాంగ్​లో ఏకంగా ఐదుగురు హీరోలు కనిపించారు. తమ డ్యాన్స్​తో దుమ్ములేపారు. మరి.. ఆ మూవీ ఏది? ఆ హీరోలు ఎవరు? అన్నది ఇప్పుడు చూద్దాం.

కన్నడ సూపర్​ స్టార్​ శివ రాజ్​కుమార్​ హీరోగా తెరకెక్కిన చిత్రం "వజ్రకాయ". ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద సూపర్​ హిట్​గా నిలిచింది. కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన హర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శివరాజ్​కుమార్​తో పాటు నభా నటేష్​, శుభ్ర అయ్యప్ప, గోపి, కారుణ్య రామ్​, అవినాష్​, రవి కాలే, మధు గురుస్వామి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అర్జున్​ జన్య మ్యూజిక్​ అందించారు. ఈ సినిమాలో పాటలు అన్ని హిట్​ అయ్యాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ధనుష్ ఓ పాట పాడడం విశేషం.

'మిస్టర్ బచ్చన్' షో రీల్​​ ఔట్- రవితేజ మాస్ జాతర- ఫ్యాన్స్​కు పూనకాలే - Mr Bachan Glimps

ఇక.. ఈ సినిమాలోని "వజ్రకాయ.. ఆంజనేయా" అంటూ సాగిపోయే టైటిల్​ ట్రాక్​లో శివరాజ్​ కుమార్​తోపాటు ఇతర భాషలకు చెందిన నలుగురు స్టార్ హీరోలు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇలా.. మొత్తం ఐదుగురు హీరోలు దుమ్ము లేపారు. వీరిలో టాలీవుడ్​ స్టార్​ కూడా ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. మాస్​ మహరాజ్​ రవితేజ. ఈ పాటలో.. రవితేజతో పాటు తమిళ నటుడు శివ కార్తికేయన్, మలయాళ నటుడు దిలీప్, కన్నడ క్రేజీ స్టార్ వి.రవిచంద్రన్.. శివ రాజ్ కుమార్​తో కలిసి స్టెప్పులు వేశారు.

టాలీవుడ్​ స్టార్​ రవితేజ సినిమాలు కన్నడలో చాలా రీమేక్​ అయ్యాయి. కానీ.. కన్నడ తెరపై రవితేజ కనిపించటం మాత్రం ఇదే తొలిసారి. పలు రవితేజ చిత్రాల రీమేక్ వెర్షన్​లలో శివరాజ్ కుమార్ నటించారు. అలా.. వీరి మధ్య అనుబంధం బలపడింది. ఇలా.. వజ్రకాయ సాంగ్​లో మెరిశారు. మరి మీరు కూడా ఈ పాటపై ఓ లుక్​ వేయండి..

భైరవ్​ ఆంథమ్​ ఫుల్ వీడియో సాంగ్​ వచ్చేసిందోచ్​ - హుషారెత్తించేలా బీట్​ - Kalki 2898 AD Bhairav Anthem

'దేవర' కోసం సూపర్​ రొమాంటిక్ సాంగ్!

ABOUT THE AUTHOR

...view details