First Actor To Charge Rs 1cr Remuneration: సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది నటీనటులు తమ యాక్టింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పటికీ రోజుకో స్టార్ ఈ ఫీల్డ్‌లో వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ వల్ల ఇతర భాషల స్టార్స్ కూడా ఇక్కడ రాణిస్తున్నారు. దీంతో వరుస సినిమాలు తెరపై సందడి చేస్తున్నాయి. అయితే మేకర్స్ కుడా బడ్జెట్‌తో రాజీపడకుండా సినిమాలను తెరకెక్కించేందకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అందులో భాగంగా స్టార్స్‌కు కూడా పెద్ద మొత్తంలో పారితోషకాన్ని ఇస్తున్నారు. కొందరు స్టార్స్ అయితే ఏకంగా 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా ఇప్పటి కాలంలో సహజమే. అయితే కోటి రూపాయలు అంటేనే చాలా పెద్ద అమౌంట్ అని భావించే కాలంలో ఓ స్టార్ హీరో ఏకంగా అంత రెమ్యునరేషన్ తీసుకుని చరిత్రకెక్కారు. ఇంతకీ ఆయనెవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి.
90స్లోనే ఈ స్టార్ హీరో దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న తారల జాబితాలో చిరు మొదటి స్థానంలో నిలిచారు. 1992లో ప్రముఖ డైరెక్టర్ కే. విశ్వనాథ్ తెరకెక్కించిన 'ఆపద్బాంధవుడు' సినిమాకుగానూ మెగాస్టార్ తొలిసారి రూ. 1.25 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారు. అప్పటికే బాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్న అమితాబ్ కూడా దాదాపు 90 లక్షలు మాత్రమే అందుకునేవారట. దీంతో స్టార్ హీరో వల్ల ఆడియెన్స్ ఫోకస్ అంతా ఒక్కసారిగా టాలీవుడ్‌కు షిష్ట్ అయ్యింది. అయితే మెగాస్టార్ చిరంజీవి అందుకున్న విజయాలు, బాక్సాఫీస్ వద్ద సాధించిన రికార్డు కలెక్షన్లు కారణంగానే ఆయనకు ఆ రేంజ్లో రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.