Poonam Pandey Harrassed :బాలీవుడ్ నటి పూనమ్ పాండే వింత చర్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె చుట్టూ కాంట్రవర్సీలు కూడా ఎక్కువే. అలాంటి నటికి తాజాగా ఓ అనూహ్య పరిణామం ఎదురైంది. సెల్ఫీ కోసం దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి ఆమెకు ముద్దుపెట్టబోయాడు. దీంతో షాక్కు గురైన పూనమ్ అతడిని పక్కకు నెట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇదీ జరిగింది
పూనమ్ తాజాగా ముంబయి నగర వీధుల్లో తిరిగారు. ఈ సమయంలోనే ఓ అభిమాని సెల్ఫీ కోసం తన దగ్గరికి వచ్చాడు. సెల్ఫీకి పూనమ్ అంగీకరించారు. అయితే ఫొటో తీసుకుంటున్న క్రమంలో సదరు అభిమాని ఆమెకు ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. అభిమాని చర్యలకు పూనమ్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆమెతోపాటు, అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు వెంటనే ఆతడిని పక్కకు నెట్టేశారు. ఈ వీడియో వైరల్గా మారింది.