Family Star Twitter Review :రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన లేటెల్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 5) థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన అభిమానులు ఈ చిత్రం గురించి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?
ప్రస్తుతం ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. అయితే విజయ్, మృణాల్ యాక్టింగ్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. కొన్ని ఎమోషన్ సీన్స్ బాగున్నాయని, కానీ స్క్రీన్‌ప్లే అంతగా ఆకట్టుకోలేదని ఓ నెటిజన్ పేర్కొన్నారు. మరొకరేమో ఈ సినిమా సూపర్ అని బాగా ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు. ఇది ఫ్యామిలీ బొమ్మ అని కామెంట్లు పెడుతున్నారు.
ఇంకొకరేమో ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్‌గా ఉందని అంటున్నారు. ఈ సినిమాకు కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యిందని, ఇంటర్వెల్ బ్యాంగర్ వేరే లెవెల్లో ఉందని అభిప్రాయపడ్డారు. ఇక సెకెండ్ హాఫ్‌లో ఎమోషన్స్ బాగా పండాయ్ అని అన్నారు. ఇక పరశురామ్ రైటింగ్ బాగుందని మరొకరు కామెంట్ పెట్టారు.