ETV Bharat / state

మరో భూ వివాదంలో మల్లారెడ్డి - నమ్మించి గొంతు కోశారంటూ వృద్ధ రైతు ఆవేదన - MALLA REDDY IN ANOTHER LAND DISPUTE

మల్లారెడ్డి తనను మోసం చేశారని ఆరోపించిన రైతు కళ్లెం నర్సింహా రెడ్డి - దగ్గరి బంధువే కదా అని భూమి అమ్మితే నమ్మించి గొంతు కోశారని ఆవేదన

Malla Reddy in another land Dispute
Malla Reddy in another land Dispute (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2024, 9:25 PM IST

Malla Reddy in another land Dispute : మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో భూ వివాదంలో చిక్కుకున్నారు. దగ్గరి చుట్టమే కదా అని నమ్మితే మల్లారెడ్డి తనను నమ్మించి గొంతు కోశారని దోమలగూడకు చెందిన 87 ఏళ్ల వృద్ధ రైతు కళ్లెం నర్సింహా రెడ్డి తన గోడు వెళ్లబోసుకున్నారు. మల్లారెడ్డి నుంచి తనకు రావాల్సిన డబ్బులను ఇప్పించాలని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

నాకు రావాల్సిన డబ్బును ఇప్పించండి : కళ్లెం నర్సింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండలంలోని యాడారంలో సర్వే నంబర్ 249, 250లో తనకు 23.26 ఎకరాల భూమి ఉందన్నారు. అందులో 9.29 ఎకరాలను రూ.21.88 కోట్లకు కొనేందుకు తనతో మల్లారెడ్డి ఎంఓయూ చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం విడతల వారీగా రూ.8.03 కోట్లు చెల్లించినట్లుగా వివరించారు.

నాలాంటి వృద్ధుడికి మోసం చేయడం సమంజసం కాదు : మిగతా రూ.14 కోట్లు తర్వాత ఇస్తానని నమ్మించి భూమిని సీఎంఆర్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుపై మల్లారెడ్డి జూన్​లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు. ఆ తర్వాత మిగిలిన రూ.14 కోట్లకు చెక్కులు ఇవ్వగా అవి బౌన్స్ అయినట్లుగా చెప్పారు. 40 రోజులుగా ఆ డబ్బులు అడిగితే మల్లారెడ్డి స్పందించడం లేదన్నారు. తనకు రావాల్సిన సొమ్మును ఎలాగైనా తనకు ఇప్పించేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

"యూడారం తురకపల్లిలో నాకు 23 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డి నా దగ్గరకు మూడు సార్లు వచ్చి మూడు రేట్లు కుదిరించుకుని చివరకు ఎకరానికి రూ. 2 కోట్ల 25 లక్షల లెక్క మాట్లాడుకున్నారు. దగ్గర బంధువని నమ్మి అతడికి భూమి ఇచ్చాను. ఇందుకు సంబంధించిన రూ.14 కోట్ల డబ్బు అతడు నాకు ఇవ్వాల్సి ఉంది. నా లాంటి వృద్ధిడికి ఇలా మోసం చేయడం సమంజసం కాదు. నేను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లాలనుకుంటున్నా."- కళ్లెం నర్శింహా రెడ్డి, వృద్ధ రైతు

కేసు పెడితే పెట్టుకోండి - నా స్థలాన్ని నేను కాపాడుకుంటా - పోలీసులపై మల్లారెడ్డి చిందులు - MALLAREDDY land dispute issue

భూ వివాదంలో మల్లారెడ్డి వర్సెస్​ అడ్లూరి లక్ష్మణ్​ - నువ్వానేనా అంటూ సవాల్​? - MLA Adluri Laxman on MLA Mallareddy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.