ETV Bharat / state

క్షణికావేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు - తప్పిదమెక్కడో గుర్తించకుంటే తీవ్ర నష్టమే!

చిన్న కారణాలతో విద్యార్థుల ఆత్మహత్యలు - తల్లిదండ్రులకు మిగులుతున్న కన్నీరు- మానసిక వికాసం, మనోధైర్యం పెంచే కార్యాచరణ అత్యవసరం

Suicides in IITs is Increasing In Telangana
Suicides in IITs is Increasing In Telangana (eenadu.net)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Suicides in IITs is Increasing In Telangana : ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించడం ఒక ఎత్తైతే అందులో చేరి భవిష్యత్తును నిర్మించుకోవటానికి కన్న కలలు మరో ఎత్తు. ఎన్నో ఆశలతో పాఠశాల స్థాయి నుంచి ఇక్కడి వరకు వచ్చిన విద్యార్థులు స్వల్ప కారణాలు, సమస్యలతో తనువు చాలిస్తున్నారు. పిల్లల అందమైన భవిష్యత్తు ఊహించిన తల్లిదండ్రులకు వేదన మిగులుతోంది. ఇందుకు కారణం బలవన్మరణాల నివారణ చర్యలు లేకపోవడం, భద్రతా వైఫల్యమే అని తెలుస్తోంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం పల్లె నుంచి పట్నం బాట పడుతున్న విద్యార్థుల్లో ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పటివరకు తల్లిదండ్రులతో అల్లారుముద్దుగా ఉంటూ విద్యాభ్యాసం సాగించిన వారు ఒక్కసారిగా వాళ్లను వదిలి చదువుల ఒత్తిడికిలోనై తనువు చాలిస్తున్నారు.

ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు

  • విద్యార్థుల వసతి గృహాలను మూడు పూటల తనిఖీ చేయాలి. బాలికల వసతి గృహాల్లో పర్యవేక్షకుల సంఖ్య పెంచి నిరంతరం నిఘా పెట్టాలి.
  • హాస్టల్‌ గదుల్లో విద్యార్థినులను ఒంటరిగా ఉండనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ప్రధానంగా తీసుకోవాల్సిన చర్య ఏంటంటే సీలింగ్‌ ఫ్యాన్లను తొలగించి వాటికి బదులుగా పెడస్టర్‌, గోడ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలి.
  • కౌన్సెలింగ్‌ ఇచ్చేవారి సంఖ్య పెంచాలి.
  • విద్యార్థులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారిని తరచూ పలకరించాలి, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోవాలి. కాస్త కలివిడిగా మాట్లాడి మనోధైర్యాన్ని నింపాలి.
  • విద్యార్థి తల్లిదండ్రులతో అధ్యాపకులు సత్సంబంధాలు కలిగి ఉండాలి. పిల్లల వ్యక్తిగత సమస్యలను తల్లిదండ్రులను దృష్టికి తీసుకెళ్లే వ్యవస్థ ఉంటే మేలు.

బాసర ట్రిపుల్​ ఐటీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి - క్యాంపస్​లో ఆందోళనలు

ఇప్పటివరకు 19 మంది మృతి : ఆర్జీయూకేటీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు 19 మంది స్టూడెంట్స్​ వివిధ కారణాలతో ప్రాంగణంలోనే ప్రాణాలు వదిలారు. ఇందులో గడిచిన ఐదేళ్లలోనే 9 మంది ఉండటం గమనార్హం. వీరిలో 5 విద్యార్థులు, 4 విద్యార్థినులు ఉన్నారు. ఇందులో 8 మంది విద్యార్థినులు సీలిగ్​ ఫ్యాన్లకు ఉరి వేసుకున్నారు. ఒకరు ప్రమాదవశాత్తు బిల్డింగ్​ పైనుంచి పడి మృతి చెందారు.

ఎవరిది తప్పు : ఆర్జీయూకేటీ ప్రాంగణంలో ఐదు హాస్టల్స్‌ ఉన్నాయి. రెండు విద్యార్థులకు, మూడు విద్యార్థినులకు వినియోగిస్తున్నారు. మొత్తం 9,000 మంది విద్యార్థిని, విద్యార్థులు ఉన్నారు. విద్యార్థినుల పర్యవేక్షణకు మొత్తం 18మంది పర్యవేక్షకులు అవసరం కానీ ప్రస్తుతం నలుగురే ఉన్నారు. కనీసం సగం మంది కూడా లేరు. ఫలితంగా విద్యార్థుల కదలికలపై పూర్తిస్థాయిలో పరిశీలన ఉండడంలేదు. గతంలో పర్యవేక్షకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరించినా పెండింగ్‌లో పెట్టారు. ఇటీవల పీయూసీ విద్యార్థిని స్వాతిప్రియ ఆత్మహత్య చేసుకున్న ఘటన గురించి అందరికి తెలిసిందే. ఈ ఘటన అనంతరం వెంటనే 14మంది పర్యవేక్షకులుగా నియమించగా వారు విధుల్లో చేరాల్సి ఉంది.

'అమ్మానాన్న - నేను చేసేది తప్పే కానీ తప్పలేదు' : ర్యాంకుల ఒత్తిడి తట్టుకోలేక స్టూడెంట్ సూసైడ్

ఏవండీ పిల్లలు జాగ్రత్త - లైంగిక వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.