ETV Bharat / sports

IPL 2025 మెగా వేలం ప్లేయర్ల ఫైనల్ లిస్ట్ ఇదే - మొత్తం ఎంత మంది అంటే?

ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితా ప్రకటన.

IPL 2025 Player Auction List
IPL 2025 Player Auction List (source IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

IPL 2025 Player Auction List : ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి కీలక అప్డేట్​ వచ్చింది. వేలంలో పాల్గొనడానికి 1,574 మంది క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 574 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు నిర్వాహకులు. ఈ వివరాలను ఐపీఎల్ తన అధికార సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మెగా వేలాన్ని నవంబర్ 24, 25వ తేదీల్లో జెడ్డా (సౌదీ అరేబియా) వేదికగా నిర్వహించనున్నారు.

నవంబర్ 24న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మెగా వేలం ప్రారంభం కానుంది. గతంలో వేలం నిర్వాహకురాలిగా మల్లికా సాగర్‌ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా ఆమెనే నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది.

  • భారత క్యాప్‌డ్ ప్లేయర్లు 48 మంది ఉండగా, విదేశీ క్యాప్‌డ్ ప్లేయర్లు 193 ఉన్నారు. అన్‌క్యాప్‌డ్ ఇండియన్ ప్లేయర్స్​ 318, ఫారెన్​ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు 12, అసోసియేట్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్లు వేలంలో పాల్గొననున్నారు.
  • కనీస ధర రూ.2 కోట్లు ఉన్న ప్లేయర్స్​ 81 మంది ఉన్నారు. బేస్‌ ధర రూ.1.50 కోట్లు ఉన్న ఆటగాళ్లు 27 మంది ఉన్నారు.
  • అత్యధికంగా 320 మంది ప్లేయర్స్​ కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు.
  • తొలి సెట్‌లో శ్రేయస్ అయ్యర్, జోస్‌ బట్లర్, రిషభ్‌ పంత్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ, మిచెల్ స్టార్క్‌ ఉన్నారు.
  • సెట్‌ 2లో లివింగ్‌స్టోన్, యుజ్వేంద్ర చాహల్, కేఎల్ రాహుల్, డేవిడ్ మిల్లర్, షమి, మహ్మద్‌ సిరాజ్‌లు చోటు సంపాదించుకున్నారు.
  • సెట్‌ 3లో డేవాన్ కాన్వే, హ్యారీ బ్రూక్, మార్‌క్రమ్, జేక్ ఫ్రేజర్, రాహుల్ త్రిపాఠి, దేవదత్ పడిక్కల్, డేవిడ్ వార్నర్ ఉన్నారు.
  • సెట్‌ 4లో వెంకటేశ్‌ అయ్యర్‌, అశ్విన్‌, మ్యాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌, రచిన్‌ రవీంద్ర, హర్షల్‌ పటేల్‌, స్టోయినిస్
  • సెట్‌ 5లో డికాక్‌, బెయిర్‌స్టో, ఇషాన్‌కిషన్‌, గుర్బాజ్‌, ఫిల్‌ సాల్ట్‌, జితేశ్‌ శర్మ
  • సెట్‌ 6లో హాజిల్‌వుడ్‌, బౌల్ట్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ఆవేశ్‌ ఖాన్‌, నోర్జే, నటరాజన్‌, ఖలీల్‌ అహ్మద్‌
  • సెట్‌ 7లో రాహుల్‌ చాహర్‌, హసరంగ, తీక్షణ, సలామ్‌ఖీల్‌, ఆడమ్‌ జంపా

అతి తెలివి ప్రదర్శించిన పాకిస్థాన్‌ - ఛాంపియన్స్​ ట్రోఫీ టూర్‌ క్యాన్సిల్‌ చేసిన ఐసీసీ!

2028 ఒలింపిక్స్​లో క్రికెట్- ఆతిథ్య నగరానికి 3వేల మైళ్ల దూరంలో పోటీలు- ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.