Dhanush Aishwarya Divorce :ప్రముఖ తమిళ నటుడు ధనుశ్, ఐశ్వర్య రజనీకాంత్లకు ఫ్యామిలీ కోర్ట్ బుధవారం విడాకులు మంజూరు చేసింది. దీనితో వీరి 18 ఏళ్ల వివాహబంధానికి తెరపడింది.
18 ఏళ్ల బంధం కట్ - హీరో ధనుశ్, ఐశ్వర్యలకు విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్ట్ - DHANUSH AISHWARYA DIVORCE
పరస్పర అంగీకారంతోనే ధనుశ్, ఐశ్వర్య డైవర్స్ - 18 ఏళ్ల బంధానికి స్వస్తి
![18 ఏళ్ల బంధం కట్ - హీరో ధనుశ్, ఐశ్వర్యలకు విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్ట్ Dhanush Aishwarya Divorce](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-11-2024/1200-675-22993348-thumbnail-16x9-danush.jpg)
Published : Nov 27, 2024, 8:46 PM IST
ప్రముఖ తమిళ సినీ డైరెక్టర్ కస్తూరిరాజా కుమారుడే ధనుశ్. ఆయన సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను 2004 నవంబర్ 18న పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల ఆశీస్సులతోనే ఈ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. దాదాపు 18 ఏళ్లపాటు కాపురం చేసిన ఈ జంట 2022 నవంబర్‌లో తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తరువాత చట్టబద్ధంగా విడిపోవడానికి ఫ్యామిలీ కోర్ట్‌ను ఆశ్రయించారు. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది నవంబర్ 21న ఫ్యామిలీ కోర్ట్ ముందు వీరిరువురూ విచారణకు హాజరయ్యారు. పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయస్థానానికి తెలిపారు. దీనితో న్యాయమూర్తి బుధవారం వారికి విడాకులు మంజూరు చేశారు.