తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మరోసారి ట్రెండింగ్​లో 'ఆర్​ఆర్ఆర్'- మూవీపై హాలీవుడ్ సింగర్ ప్రశంసలు - ED Sheeran on Naatu Naatu RRR

ED Sheeran on Naatu Naatu RRR: జూనియర్ ఎన్​టీఆర్- రామ్​చరణ్ 'ఆర్ఆర్ఆర్' మూవీ మరోసారి ఇంటర్నెట్​లో ట్రెండింగ్​గా మారింది. ఈ సినిమాపై హాలీవుడ్ సింగర్ ఎడ్ షీరన్ ప్రశంసలు కురిపించారు.

ED Sheeran on Naatu Naatu RRR
ED Sheeran on Naatu Naatu RRR

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 7:46 AM IST

Updated : Mar 15, 2024, 8:38 AM IST

ED Sheeran on Naatu Naatu RRR: దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా 2022లో భారీ విజయం దక్కించుకుంది. ఈ సినిమాలో నటించిన అగ్ర హీరోలు జూనియర్ ఎన్​టీఆర్, రామ్​చరణ్ ఒక్కసారిగా​ గ్లోబల్ స్టార్లుగా ఎదిగారు. ఈ సినిమాలోని పాట 'నాటు నాటు'కు సైతం గతేడాది ఆస్కార్ అవార్డు వరించింది. దీంతో 'ఆర్ఆర్ఆర్' ఖ్యాతి ప్రపంచం నలుమూలలా వ్యాపించింది.

అక్కడితో ఆగకుండా అనేక దేశాల్లో ఈ మూవీకి సూపర్ రెస్పాన్స్​ వచ్చింది. ఇక రీసెంట్​గా 2024 ఆస్కార్ అవార్డు వేదిక బ్యాక్​గ్రౌండ్​లో 'నాటు నాటు' విజువల్స్ ప్లే చేయడం వల్ల మళ్లీ సినిమా ట్రెండింగ్​లో నిలిచింది. తాజాగా మరోసారి 'ఆర్ఆర్ఆర్' పేరు ఇంటర్నెట్​లో ట్రెండ్ అవుతోంది. హాలీవుడ్ సింగర్ ఎడ్ షీరన్ (Ed Sheeran) ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. నిడివి 3 గంటలు ఉన్నప్పటికీ ఇది అద్భుతమైన సినిమా అని కొనియాడారు.

'దాదాపు ఏడాది కిందట నా టీమ్​మేట్స్​తో కలిసి ఈ సినిమా (ఆర్ఆర్ఆర్) చూశాను. ఈ సినిమాలో డాన్స్ ఓ రెంజ్​లో ఉంది. సినిమా కూడా అద్భుతంగా ఉంది. ఇది 3 గంటలపాటు సాగిన ఓ అద్భుతమైన సినిమా. ఓవరాల్​గా సినిమా, టెక్నికల్ విలువలు నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. నాకు తెలిసి ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ సినిమా కదా?' అని షీరన్ అన్నారు. వెంటనే 'కాదు కాదు అది ఇండియన్ ఫిల్మ్' అని యాంకర్ షీరన్​కు చెప్పారు. ఇక ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ అఫీషియర్ ట్విట్టర్​ పేజ్​లో షేర్ చేసింది. 'మీకు నాటు నాటు తెలుసా? అవునుఎడ్ షీరన్​కు నాటు కంటే ఎక్కువే తెలుసు' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక షీరన్​ రీసెంట్​గా అల్లు అర్జున్- పూజా హెగ్డే బ్లాక్​బస్టర్ హిట్ మూవీ 'అల వైకుంఠపురం'లోని 'బుట్ట బొమ్మ' పాటకు డాన్స్​ చేశారు. ఈ వీడియో కూడా ట్విట్టర్​లో బాగా వైరలైంది. ఇక 2022లో రిలీజైన ఆర్ఆర్ఆర్ వరల్డ్​వైడ్​గా దాదాపు రూ.1200 కోట్లు వసూల్ చేసింది.

ఆస్కార్ వేదికపై మరోసారి 'నాటు నాటు'- టాలీవుడ్ రేంజ్​ అట్లుంటది మరి

ఆస్కార్ @96 : గతేడాది 'నాటు నాటు'కు - మరి ఈ సారి కూడా భారత్​కు దక్కేనా?

Last Updated : Mar 15, 2024, 8:38 AM IST

ABOUT THE AUTHOR

...view details