Nag Ashwin About Dulquer Salmaan : మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వరుస హిట్‌లతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు 'లక్కీ భాస్కర్' మూవీతో కూడా సక్సెస్ అందుకున్నారు. దీపావళి సందర్భంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. దీంతో మేకర్లు సక్సెస్ మీట్ నిర్వహించారు. దీనికి స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ హాజరయ్యారు. 'మహానటి' సినిమా సమయంలో దుల్కర్‌తో జరిగిన ఓ ఆసక్తికర ఘటనను షేర్ చేసుకొన్నారు.
నాగ్ అశ్విన్ సూపర్ హిట్ మూవీ 'మహానటి'తోనే దుల్కర్ టాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. డబ్బింగ్ సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే అయినా, 'మహానటి'తో మొదటి స్ట్రైట్ ఫిల్మ్ చేశారు. ఈ సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో మెరిశారు. ఇందులో దుల్కర్ యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి, సినిమా భారీ కలెకన్లు రాబట్టింది. అయితే నిర్మాత కథ చెప్పకముందే దుల్కర్ ఈ మూవీని రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్నే నాగ్ అశ్విన్ స్వయంగా చెప్పారు.
సస్కెస్ మీట్లో మాట్లాడిన నాగ్ అశ్విన్ "చెన్నైలో దుల్కర్‌కు మహానటి కథ చెప్పేందుకు వెళ్లినప్పుడు, తాను తెలుగు సినిమాలు చేయలేనని చెప్పారు.'నేను తెలుగు భాష ఎలా మాట్లాడగలను? ప్రజలు నన్ను చూస్తారా? ఈ కుర్రాడికి భాష కూడా తెలియదని అంటారని' చెప్పారు. కట్ చేస్తే ఆరేళ్ల తర్వాత హ్యాట్రిక్ హిట్‌లు అందుకున్నారు. మూడు బ్లాక్‌బస్టర్‌లు అందించారు. ఇప్పుడు ఆయన తెలుగు సూపర్‌స్టార్‌లలో ఒకరు. ఈ రేంజ్ సక్సెస్ అందుకున్నందుకు సంతోషం. థాంక్యూ.' అని చెప్పారు.