Double Ismart:టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది. తొలి పార్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడం వల్ల ఈ సినిమాను పాన్ఇండియా లెవెల్లో తీసుకురానున్నారు. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది.
ఇప్పటికే మూవీ ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజైంది. ఈ పోస్టర్లో రామ్ గడ్డంతో భుజంపై తుపాకి పట్టుకొని ఉన్నాడు. ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా హీరో రౌండ్‌గా ఆయుధాలతో పోస్టర్ డిజైన్ చేశారు. ఈ పోస్టర్లో మాస్‌గా ఉన్న రామ్ లుక్ కూడా అందర్మీ ఆకట్టుకుంది. అయితే ప్రేక్షకులు గతంలో విడుదలైన ఈ పోస్టర్ తప్పా, సినిమా గురించి మరెలాంటి అప్డేట్ రాలేదు. దీంతో రామ్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు.
అయితే మూవీ టీమ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపే పనిలో పడింది. త్వరలోనే ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల (మే 15)లో హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలో సినిమా టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ (సాంగ్) రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇస్తారో. ఇక ఈ సినిమాకు మ్యూజికల్ కింగ్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.