తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇండస్ట్రీలోకి మరో నందమూరి హీరో - హరికృష్ణ మనవడిని పరిచయం చేసిన వై.వి.ఎస్‌. చౌదరి - YVS CHOWDARY NEW MOVIE

హరికృష్ణ మనవడిని పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ - ఇండస్ట్రీలోకి మరో నందమూరి హీరో ఎంట్రీ!

Nandamuri Taraka Rama Rao
Nandamuri Taraka Rama Rao (Pressmeet Screenshot)

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2024, 11:43 AM IST

దివంగత నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ తనయుడు తారక రామారావు హీరోగా డైరెక్టర్ వై.వి.ఎస్‌.చౌదరి కొత్త సినిమాను తెరకెక్కించనున్నారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకునేందుకు ఓ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అందులో న్యూ హీరో తారక రామారావుని పరిచయం చేశారు. ఈ సమావేశానికి సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, అలాగే నిర్మాత అశ్వనీదత్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 'న్యూ టాలెంట్‌ రోర్స్‌' పతాకంపై వై.వి.ఎస్ చౌదరి సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.

గతంలోనే ఈ యంగ్​ హీరోను పరిచయం చేస్తున్నట్లు డైరెక్టర్ వై.వి.ఎస్ చౌదరి అధికారికంగా ప్రకటించారు. తనను పరిచయం చేసినందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. 'సీనియర్‌ ఎన్​టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్‌ పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావును నేను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నందుకు గర్వంగా ఉంది. హరికృష్ణతో సినిమాలు తీసే అదృష్టం నాకు దక్కింది. ఇప్పుడు ఆయన మనవడిని కూడా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాను' అని వై.వి.ఎస్ అన్నారు.

ఇక 'సీతా రాముల కల్యాణం చూదము రారండి', 'యువరాజు', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'సీతయ్య', 'దేవదాస్‌' వంటి ఎన్నో హిట్‌ సినిమాలు తెరకెక్కించారు దర్శకుడు వైవిఎస్‌ చౌదరి. చివరిగా 'రేయ్‌' సినిమా తీశారు. అది ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఆయన సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడీ సినిమాతో మళ్లీ ఇండస్ట్రీలోకి కమ్​బ్యాక్ ఇచ్చారు.

అయితే నందమూరి తారకరామారావునే కాకుండా ఆయన గతంలోనూ ఎంతో మంది స్టార్స్​ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అందులో వెంకట్, చాందిని, చందు, ఆదిత్య ఓం, అంకిత, రామ్, ఇలియానా, సాయిధరమ్‌ తేజ్, సయామీఖేర్‌ తదితరులు ఉన్నారు. వీరందరూ కూడా మంచి హిట్ చిత్రాల్లో నటించి సినిమాల్లో రాణించారు. ఇక 'బొమ్మరిల్లు వారి' అనే పేరుతో ఈయనకు ఓ సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది.

'తారక్​తో సినిమా ఎందుకు చేయలేదు'- YVS ఆన్సర్​ ఇదే!

ఎన్టీఆర్​ అభిమాన సంఘం అధ్యక్షుడు.. దర్శకుడిగా మారితే!

ABOUT THE AUTHOR

...view details