తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దిమాక్​ కిరికిరి - డబుల్ మాస్​ డైలాగ్​లతో టీజర్ బ్లాస్ట్​ - Ram pothineni Double Ismart teaser - RAM POTHINENI DOUBLE ISMART TEASER

Ram pothineni Double Ismart teaser : లైగర్ దెబ్బకు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన దర్శకుడు పూరీ జగన్నాథ్ 'డబుల్ ఇస్మార్ట్'తో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమైపోయారు. తాజాగా రామ్ పుట్టినరోజు సందర్భంగా పవర్ ఫుల్​ టీజర్​ రిలీజ్ చేశారు.

Ram pothineni
Ram pothineni (Source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 11:49 AM IST

Updated : May 15, 2024, 12:34 PM IST

Ram pothineni Double Ismart teaser :రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన "డబుల్ ఇస్మార్ట్" సినిమా టీజర్ వచ్చేసింది. మే 15న రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో రామ్ ఫుల్ మాస్ లుక్​లో కనిపించడంతో పాటు మరోసారి పక్కా తెలంగాణ యాసలో మాస్ డైలాగ్​లతో అదరగొట్టారు. మరో వైపు "డబుల్ ఇస్మార్ట్" చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా టీజర్​లో స్టైలీష్ విలన్​లా కనిపించారు. చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న కావ్య థాపర్ కూడా టీజర్లో హాట్ లుక్​లో మెరిసి వెళ్లిపోయారు.
కమెడియన్ అలీ కూడా చాలా డిఫరెంట్ లుక్​లో కనిపించి నవ్వులు పూయించారు. ఈ ప్రచార చిత్రం చూస్తుంటే "డబుల్ ఇస్మార్ట్" ఫైట్లను కూడా పూరీ తన మార్క్​ స్టెల్లో డిఫరెంట్​గా తెరకెక్కించినట్లు అర్థమైపోతోంది. అయితే టీజర్ చివర్లో శివుడిని చూపించి ప్రేక్షకులను ఆశ్యర్చపరిచారు దర్శకుడు పూరీ. కథకీ, శివుడికీ ఏంటీ సంబంధం అనే విషయం తెలియాలంటే సినిమా విడుదల వరకూ వేచి చూడాల్సిందే. మొత్తానికి టీజర్ చూస్తుంటే పూరీ మరోసారి రామ్​ను పక్కా ఊర మాస్ హీరోగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఫైనల్​గా మాస్ డైలాగ్స్, పవర్ ఫుడ్ ఫైట్స్​తో పాటు కామెడీకి కూడా ఎక్కడా కొదవేం లేదని అనిపించేలా ఉంది డబుల్ ఇస్మార్ట్ టీజర్.

కాగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన "ఇస్మార్ట్ శంకర్" మూవీ 2019 విడుదలైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్​గా నిలవడమే కాకుండా హీరో రామ్​కు పూరీకి డిఫరెంట్ మాస్ ఈమేజ్ తెచ్చి పెట్టింది. ఇప్పుడు దానికి సీక్వెల్​గా రూపొందిన మూవీనే "డబుల్ ఇస్మార్ట్". దర్శకుడు పూరీ తన సొంత నిర్మాణంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తెరక్కెక్తిస్తున్నారట పూరీ. ప్రస్తుతం సినిమా షూటింగ్ ముంబయిలో శరవేగంగా జరుపుతుండగా విడుదల తేదీ గురించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.

గతంలో విజయ్ దేవరకొండతో కలిసి చేసిన "లైగర్" సినిమా ఆశించిన ఫలితాలు అందించకపోవడంలో "డబుల్ ఇస్మార్ట్" చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నారట పూరీ. మొదటి భాగం కన్నా డుబుల్ వినోదంతో సినిమాను తెరకెక్కించేందుకు బాగా కష్టపడుతున్నట్లు సమాచారం. మరోవైపు హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తూ ఇమేజ్ ను పెంచుకుంటున్న రామ్ ఈ సారి ఊర మాస్ లుక్​లో, డబుల్ మాస్ డైలాగ్ లతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీజర్ చూస్తుంటే వీరిద్దరి ఆశలు నెరవేరేలానే కనిపిస్తుంది. ఏదైమైనా సినిమా విడుదల కోసం అటు పూరీ ఫ్యాన్స్, ఇటు రామ్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రంలో అప్పటివరకు సినిమా ప్రదర్శనలు నిలిపివేత - TELANGANA THEATRES BANDH
Last Updated : May 15, 2024, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details