తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రూ. 51 రెమ్యూనరేషన్ - ఆ సినిమా విషయంలో తొలిసారి పేరు మార్చుకున్న ధర్మేంద్ర

Dharmendra Net Worth : 80స్​లో హిందీ ఇండస్ట్రీని శాసించిన స్టార్ యాక్టర్స్​లో ధర్మేంద్ర ఒకరు. కెరీర్​ తొలినాళ్లలో సపోర్టింగ్ రోల్స్​కు పరిమితమైన ఆయన ఇప్పుడు యంగ్ హీరోలకు దీటుగా బాలీవుడ్​లో రాణిస్తున్నారు. అయితే ఈయన తాజాగా ఓ సినిమా విషయంలో తన పేరును మార్చుకున్నారట. ఎందుకుంటే ?

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 3:35 PM IST

Dharmendra Net Worth : ఎలాంటి బ్యాక్ సపోర్టు లేకుండానే కొంత మంది స్టార్స్ ఇండస్ట్రీలో రాణిస్తుంటారు. తమ స్వయం కృషితో అంచెలంచలుగా ఎదుగుతుంటారు. అందులో బీటౌన్ స్టార్ ధర్మేంద్ర ఒకరు. 80వ దశకంలో సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపిన ఆయన ఇప్పటికీ ఎవర్​గ్రీన్ స్టార్​గా రాణిస్తున్నారు. యాక్షన్ స్టార్​గా పేరొందిన ఆయన, జానర్ ఏదైనా సరే తన పాత్రలో ఇట్టే ఒదిగిపోయి నటిస్తారు.

కెరీర్​ తొలినాళ్లలో ఆఫర్లు దొరక్క సపోర్టింగ్​ రోల్స్​కు పరిమితమైన ఈ స్టార్ హీరో, ఆ తర్వాత తన నటనతో హీరోగా నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. క్రమ క్రమంగా ఇండస్ట్రీలో ఎదిగారు. ఆయన ఇప్పటివరకు 300 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు. తొలి సినిమాకుగానూ రూ.51 రెమ్యూనరేషన్ అందుకున్న ఆయన ఇప్పుడు రూ. 5 కోట్లకు మేర సంపాదనతో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏళ్లు. అయినప్పటికీ యంగ్ హీరోలకు ధీటూగా నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే ఆయన 'రాకీ ఔర్​ రాణీ కీ ప్రేమ్ కహాని' అనే బాలీవుడ్ సినిమాలో మెరిశారు.

64 ఏళ్లలో తొలి సారి
Dharmendra Name Change :అయితే ఇటీవలే ధర్మేంద్రకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట ట్రెండ్ అయ్యింది. 64 ఏళ్లుగా ఇండస్ట్రీలో ధర్మేంద్రగా రాణించిన ఆయన తాజాగా తన ఆన్-స్క్రీన్ పేరును మార్చుకున్నారు. షాహిద్ కపూర్, కృతి సనన్ నటించిన 'తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా' అనే సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక ఆ మూవీ క్రెడిట్స్​లో ఆయన తన పేరును ధర్మేంద్ర సింగ్ దేఒల్​గా మార్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందు ధరమ్​ సింగ్​ దేఓల్​గా ఉన్న ఆయన పేరును ధర్మేంద్రగా మార్చుకున్నారు. అప్పటి నుంచి అన్ని సినిమాల్లోనూ ఆయన ధర్మేంద్రగానే కనిపించారు.

ఇక ఆయన నెట్​వర్త్​ వివరాలకు వస్తే ధర్మేంద్ర ప్రస్తుతం లోనావాలాలో 100 ఎకరాల ఫామ్‌హౌస్‌తో సహా రూ. 450 కోట్ల నికర విలువ కలిగిన ఆస్తులను కలిగి ఉన్నారు. కొన్ని వందల ఎకరాల్లో వ్యవసాయ భూములను కూడా ఉన్నాయట. అంతే కాకుండా లోనావాలాలోని కాటేజ్ రిసార్ట్స్ చెయిన్ సంస్థలో భాగస్వామ్యం కలిగి ఉన్నరాని సమచారం. ఇక ధర్మేంద్ర సతీమణి హేమామాలిని బాలీవుడ్ లో డ్రీమ్ గర్ల్ గా ప్రసిద్ధి చెందారు. ఇక ఆయన కుమారులు సన్నీ దేఓల్, బాబి దేఓల్​ కూడా ఇద్దరు కూడా బాలీవుడ్లో హీరోలుగా రాణించారు. ఆయన కుమార్తె ఈశా డియోల్ సైతం పలు చిత్రాల్లో నటించారు.

గ్యారేజీలో నివాసం - 200 రూపాయల సంపాదన - ఇప్పుడు బీటౌన్​ సూపర్ స్టార్​

బాలీవుడ్​ తొలి హీమ్యాన్.. యాక్షన్ కింగ్ ధర్మేంద్ర

ABOUT THE AUTHOR

...view details