Dharmendra Hema Malini Love Story : కుటుంబాలు ధిక్కరించినా, సమాజం చిన్న చూపు చూసిన డోంట్ కేర్ అంటూ డ్రీమ్ గర్ల్ హేమా మాలిని, దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఒక్కటైన తీరు గురించి ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతూనే ఉంటుంది. 'తు హసీన్ మెయిన్ జవాన్' సెట్స్‌లో తొలిసారి కలుసుకున్న ఈ జంట, సినిమా షూటింగ్ ముగిసే సమయానికి తమ పరిచయాన్ని కాస్త ప్రేమగా మార్చుకున్నారు. అయితే అప్పటికే ధర్మేంద్రకు ప్రకాశ్ కౌర్ అనే మహిళతో వివాహం జరిగింది. పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఈ జంట చాలా కాలం పాటు ఆలోచించి 1980లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యూన్యంగా ఉంటున్నారు.
ఎన్నోసార్లు తనపైనున్న అమితమైన ప్రేమను తెలియజేస్తుంటారు ధర్మేంద్ర. కానీ 1981లో ఆయన చేసిన ఓ పని గురించి వారి సన్నిహితురాలు నీతూ కోహ్లీ వెల్లడించారు. హేమా మాలిని తన తొలి సంతానానికి జన్మనిచ్చే సమయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఆమె డెలివరీ కోసం హాస్పిటల్లో చేరిందన్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదని అనుకున్న ధర్మేంద్ర, ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచేందుకు ఆయన ఆ ఆస్పత్రి మొత్తనే బుక్ చేశారట. అందులో మొత్తం 100 గదులు ఉండగా, వాటన్నింటిని ఆయన బుక్ చేశారట. అయితే ఈ విషయం అప్పటి నుంచి ఇప్పటి వరకూ సీక్రెట్‌గానే ఉందట. తాజాగా నీతూ చెప్పకా ఈ విషయం బయటపడింది. ఇది విన్న ఫ్యాన్స్ ఈ జంట లవ్ స్టోరీనీ మరోసారి రివైండ్ చేసుకుంటున్నారు. ధర్మేంద్ర చేసిన పనికి ఆశ్చర్యపోయినప్పటికీ, ఆయన సాహసానికి మెచ్చుకుంటున్నారు.
గతంలో హేమమాలికి కూడా తమ లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. ఒకానొక సందర్భంలో తనను ధర్మేంద్రకు దూరంగా ఉంచాలని హేమ తండ్రి భావించారట.