తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ముదిరిన డాక్యుమెంటరీ వివాదం - నయన్​ దంపతులపై ధనుశ్​ దావా - DHANUSH SUES NAYANTHARA

నయన్ దంపతులపై ధనుశ్​ దావా - ఎందుకంటే?

Dhanush sues Nayanthara
Dhanush sues Nayanthara (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2024, 1:18 PM IST

Dhanush sues Nayanthara :కోలీవుడ్ నటినయనతార, ఆమె భర్త, డైరెక్టర్ విఘ్నేశ్‌ శివన్​పై ధనుశ్​ దావా వేశారు. పర్మిషన్‌ లేకుండా 'నానుమ్‌ రౌడీ దాన్‌' (నేనే రౌడీనే) విజువల్స్‌ వాడుకోవడం వల్ల ఆయన నిర్మాణసంస్థ తాజాగా మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నయన్‌ దంపతులపై ధనుశ్​ పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన ధర్మాసనం, విచారణకు అంగీకరించింది.

ఏం జరిగిందంటే?
డాక్యుమెంటరీ విషయంలో నయన్​, ధనుశ్​ మధ్య తాజాగా వివాదం జరిగిన సంగతి తెలిసిందే. తమకు చాలా ముఖ్యమైన 'నానుమ్‌ రౌడీ దాన్‌' సినిమా విశేషాలను తమ పెళ్లి డాక్యుమెంటరీలో చూపించాలని నయన్ దంపతులు కోరినప్పటికీ, ఆ మూవీ నిర్మాత అయిన ధనుశ్​ నుంచి ఎటువంటి పర్మిషన్‌ రాలేదని అందుకు తాను ఎంతో బాధపడ్డానంటూ నయనతార పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఓ బహిరంగ లేఖ కూడా రిలీజ్‌ చేశారు.

అందులో డాక్యుమెంటరీ ట్రైలర్‌లో వాళ్లు మూడు సెకన్ల సీన్స్‌ ఉపయోగించినందుకుగానూ పరిహారంగా ధనుశ్​ రూ.10 కోట్లు డిమాండ్‌ చేశారంటూ నయన్ తెలిపారు. అంతేకాకుండా ఆ లేఖలో ఆమె ధనుశ్ క్యారెక్టర్‌ను కూడా తప్పుబట్టారు. ఆమెపై ధనుశ్ ద్వేషం కనబరుస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీశాయి. అయితే కొందరేమో ధనుశ్​కు మద్దతు తెలుపగా, మరికొందరేమో నయన్​కు సపోర్ట్ ఇచ్చారు.

ఇక 'నయనతార : బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. అందులో నయన్​ కెరీర్‌, ఆమె ఎదుర్కొన్న అవమానాలు, అలాగే విమర్శలను ఆ డాక్యుమెంటరీలో చూపించారు. ముఖ్యంగా విఘ్నేశ్‌ శివన్‌తో తనకు ఏర్పడ్డ పరిచయం, వారి లవ్​ స్టోరీ, పెళ్లి వేడుకను ఇందులో చూపించారు. అయితే విఘ్నేశ్‌ శివన్‌ డైరెక్ట్ చేసిన 'నానుమ్‌ రౌడీ దాన్‌'లో నయనతార హీరోయిన్‌గా నటించారు. ధనుశ్​ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఆ సినిమా సెట్‌లోనే నయన్‌ - విఘ్నేశ్‌ల స్నేహం మొదలైంది. అందుకే ఈ మూవీ వీడియోలు, పాటలను డాక్యుమెంటరీకి జత చేయాలని వారు భావించినట్లు తెలుస్తోంది.

ఈవెంట్​లో పక్కపక్కనే ధనుశ్, నయన్- కాపీరైట్స్ కాంట్రవర్సీ తర్వాత ఫస్ట్ ​టైమ్​!

'అసలు అప్పుడు ఏం జరిగింది?' - నయన్, ధనుశ్ కాంట్రవర్సీ డాక్యుమెంటరీ రివ్యూ

ABOUT THE AUTHOR

...view details