తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా' రివ్యూ - ధనుశ్​ డైరెక్ట్‌ చేసిన యూత్‌ఫుల్‌ మూవీ ఎలా ఉంది? - JABILAMMA NEKU ANTHA KOPAMA REVIEW

ధనుశ్​ తెరకెక్కించిన యూత్​ఫుల్‌ ఎంటర్​టైనర్​ ఎలా ఉందంటే?

Jabilamma Neku Antha Kopama Movie
Jabilamma Neku Antha Kopama Movie (Movie Poster)

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2025, 12:50 PM IST

Jaabilamma Neeku Antha Kopama Telugu Review :హీరోగానే కాకుండా డైరెక్టర్​గానూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కోలీవుడ్ స్టార్ ధనుశ్​. రీసెంట్​గా ఆయన 'జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా' అనే యూత్​ రిలేటడ్​ స్టోరీతో అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉందంటే?

స్టోరీ ఏంటంటే :
ప్ర‌భు (ప‌విష్‌) ఓ చెఫ్‌. నీల‌ (అనికా సురేంద్ర‌న్‌) అనే అమ్మాయితో తను ప్రేమ‌లో పడుతాడు. అయితే కొన్ని అనుకోని ప‌రిస్థితుల కారణంగా ఆమెకు దూర‌మ‌వుతాడు. దీంతో ఆ బ్రేక‌ప్ బాధ నుంచి తేరుకునే లోపే ప్ర‌భు త‌ల్లిదండ్రులు తనకు ప్రీతి (ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌)తో పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తారు. అయితే ప్రీతి - ప్ర‌భు చిన్న‌ప్పుడు స్కూల్‌ ఫ్రెండ్స్ కావ‌డం వల్ల పెళ్లి విష‌యంలో వారిద్దరు వెంట‌నే ఓ నిర్ణ‌యానికి రాలేకపోతారు.

దీంతో కొద్ది రోజులు క‌లిసి ప్ర‌యాణం చేసి త‌మ ఒపినియన్​ను పెద్ద‌లకు చెబుతారు. అయితే ఇలా జర్నీ చేసి పెళ్లికి రెడీ అవుతున్న టైమ్​లో ప్రభుకు తన ఎక్స్​ లవర్​ నీల‌ పెళ్లి ఇన్విటేషన్​ అందుతుంది. దీంతో త‌ను కుంగిపోతాడు. ఇక ప్ర‌భు ప‌రిస్థితిని అర్థం చేసుకున్న ప్రీతి వాళ్ల లవ్​ స్టోరీని తెలుసుకుని ఓ నిర్ణ‌యం తీసుకుంటుంది. మ‌రి ఆ నిర్ణ‌యం ఏంటి? ఆ డెసిషన్​ క‌థ‌ను ఎలా మ‌లుపు తిప్పింది? ప్ర‌భు - నీల మ‌ళ్లీ క‌లిశారా? లేకుంటే అత‌ను త‌న చిన్న‌ప్పటి ఫ్రెండ్​ ప్రీతినే చేసుకున్నాడా? అన్నదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే :
ఇది చాలా నార్మల్​ లవ్ స్టోరీ. రెండు ముక్క‌ల్లో చెప్పాలంటే అస‌లు ఇందులో పెద్ద క‌థేముంది? సంఘ‌ర్ష‌ణ ఏముంది? అని మనకు అనిపిస్తుంది. అందుకే డైరెక్టర్ ధ‌నుశ్​ కూడా 'ఇది చాలా కాజ్యువ‌ల్ ల‌వ్‌ స్టోరీ' పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోకండి అని ట్రైల‌ర్‌తోనే హింట్ ఇచ్చేశారు. కాక‌పోతే ఈ క‌థ చాలా సింపుల్‌గా అనిపించినా దాన్ని ఈత‌రం యువ‌త ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లుగా స‌రికొత్త ట్రీట్‌మెంట్‌తో తెర‌పై చూపించిన విధానం పాత్ర‌ల్ని వినోద‌భ‌రితంగా తీర్చిదిద్దుకున్న తీరు ఈ మామూలు క‌థ‌ను ఫ‌స్ట్‌క్లాస్ మార్కుల‌తో గ‌ట్టెక్కించేలా చేశాయి.

ఓ అబ్బాయి లవ్​లో పడటం, బ్రేక‌ప్ అవ్వ‌డం, ఆ బాధ నుంచి తేరుకునేలోపు మ‌రో అమ్మాయితో తను పెళ్లికి సిద్ధ‌మ‌వ్వ‌డం. ఇలాంటివి యువ‌త‌కు బాగా క‌నెక్ట్ అయ్యే ఫార్ములానే. అలాగే ఈ స్టోరీలోని పాత్రలు, వాటి నేపథ్యంతో ఆరంభ సన్నివేశాలు సాగుతాయి.

హీరో ఎక్స్​ లవర్​ నుంచి పెళ్లి కార్డు రావడం స్టోరీకి ట్విస్ట్. ఆ వెంట‌నే హీరో బ్రేక‌ప్ స్టోరీ మళ్లీ తెర‌పైకి వ‌స్తుంది. ఆయా సీన్స్ ప్రేక్షకులకు రొటీన్‌గానే అనిపిస్తాయి. అయితే ఈ ఇద్ద‌రి రోల్స్​ మ‌ధ్య‌లో హీరో ఫ్రెండ్ రాజేశ్​ పాత్ర‌ను మ‌లిచిన విధానం అలాగే తను చేసే అల్ల‌రి బుజ్జి అంటూ ఒక‌రిపై ఒక‌రు అతిగా ప్రేమ చూపించుకునే ర‌వి (వెంక‌టేశ్ మేన‌న్‌), శ్రేయా (ర‌బీనా ఖాటూన్‌)ల క్రింజ్ ల‌వ్‌ స్టోరీని వినోద‌భ‌రితంగా ముందుకు తీసుకెళ్తాయి. నీల తండ్రి తమ ప్రేమ‌కు ఎందుకు అడ్డు చెబుతున్నారన్న కార‌ణం తెలిశాక హీరో తీసుకునే నిర్ణ‌యం హ‌త్తుకుంటుంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఇంటర్వెల్ సీన్స్​ సెకెండాఫ్​పై అంచ‌నాలు పెంచేస్తాయి.

ఇక్క‌డి నుంచి క‌థ పూర్తిగా గోవాకు షిఫ్ట్ అవుతుంది. నీల పెళ్లి చూసేందుకు ప్ర‌భు త‌న ఫ్రెండ్​తో క‌లిసి గోవాకు వెళ్ల‌డం అక్క‌డ వారికి ఎదుర‌య్యే అనుభ‌వాల‌తో సెకెండాఫ్​ చాలా ఫన్నీగా సాగుతుంది. నిజానికి ఇలా ఓ లవర్​ త‌న మాజీ ప్రేయ‌సి పెళ్లికి వెళ్లాడంటే ఆమె మ‌న‌సు మార్చి త‌న‌ని పెళ్లి చేసుకుంటుందని అనుకుంటారు. అయితే ఇక్క‌డే ధ‌నుశ్​ ఓ తెలివైన ఆలోచ‌న చేశారు.

వెడ్డింగ్ ప్లాన‌ర్ అంజ‌లి (ర‌మ్య రంగ‌నాథ‌న్‌) యాంగిల్​ నుంచి ప్ర‌భుపై వ‌న్‌సైడ్ ల‌వ్‌ట్రాక్ న‌డ‌ప‌డం. అలాగే రాజేష్ - శ్రేయా - ర‌విల మ‌ధ్య ఓ క‌న్ఫ్యూజ‌న్ ట్రయాంగిల్‌ ల‌వ్‌స్టోరీని సెట్ చేయ‌డం ద్వారా ప్రేక్ష‌కుల్ని నాన్‌స్టాప్‌గా న‌వ్వించే ప్ర‌య‌త్నాన్ని చేశారు. ఆయా సీన్స్​ ఓవైపు న‌వ్వులు పంచుతూనే మ‌రోవైపు మ‌న‌సులను హ‌త్తుకుంటాయి. అయితే సెకండ్ పార్ట్ కోస‌మే అన్న‌ట్లుగా ఈ లవ్​ స్టోరీని అసంపూర్ణంగా ముగించిన తీరు ప్రేక్ష‌కులను అంత సాటిస్ఫై చేయకపోవచ్చు.

ఎవ‌రెలా చేశారంటే :
ధ‌నుశ్​ మేన‌ల్లుడు ప‌విష్ ఈ సినిమాతోనే హీరోగా పరిచయమయ్యాడు. తన యాక్టింగ్​లో ధ‌నుశ్​ షెడ్స్​ ఎక్కువగా క‌నిపించాయి. నీల‌గా అనికా సురేంద్ర‌న్ చాలా క్యూట్‌గా క‌నిపించింది. ప‌విష్‌తో ఆమె కెమిస్ట్రీ ఆడియెన్స్​ను ఆక‌ట్టుకుంటుంది. హీరో ఫ్రెండ్​ రాజేశ్​ రోల్​లో మాథ్యూ థామ‌స్ ఆకట్టుకున్నాడు. సినిమాలో త‌ను క‌నిపించిన ప్ర‌తి సీన్​ న‌వ్వులు పూయించింది.

ర‌బీనా, వెంక‌టేశ్ మేన‌న్‌ క్రింజ్ ల‌వ్‌స్టోరీ ఈత‌రం యూత్​కు బాగా క‌నెక్ట్ అవుతుంది. ప్రియాంక అరుళ్‌ మోహ‌న్ చేసిన 'గోల్డెన్ స్పారో' అనే స్పెషల్​ సాంగ్​ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. న్యూఏజ్‌, యూత్ ప‌ల్స్‌ను ప‌ట్టుకోవ‌డంలో ధ‌నుశ్​ పైచేయి సాధించారు. ఓ మామూలు లవ్​ స్టోరీని త‌న‌దైన డిఫ‌రెంట్ ట్రీట్‌మెంట్‌తో ఓ స్పెషల్ స్టోరీగా మార్చేశారు. జీవీ ప్ర‌కాష్ మ్యూజిక్​లో 'గోల్డెన్ స్పారో' మాత్రమే హైలైట్​.

బ‌లాలు

  • + ధనుశ్​ క‌థ‌ను న‌డిపిన విధానం
  • + ప‌విష్, మాథ్యూ థామ‌స్ యాక్టింగ్
  • + సెకెండాఫ్​లోని కామెడీ

బ‌ల‌హీన‌త‌లు

  • - రొటీన్‌గా సాగే ఫస్ట్​ హాఫ్​
  • - ఎండింగ్​
  • చివ‌రిగా : జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా- వినోదంతో నిండిన ట్రెండీ ప్రేమ‌క‌థ‌!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details