తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బ్లాక్ బస్టర్ 'దేవర' - OTTలోకి ఎన్ని రోజుల తర్వాత, ఎక్కడ వస్తుందంటే? - Devara Movie OTT Details - DEVARA MOVIE OTT DETAILS

NTR Devara Movie OTT : తొలి షో నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకున్న 'దేవర' ఓటీటీ డీటెయిల్స్​ కూడా అఫీషియల్​గా తెలిసింది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
NTR Devara Movie OTT (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2024, 10:03 AM IST

NTR Devara Movie OTT : 'దేవర'తో ఇన్ని రోజులు ఊరిస్తూ వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్​ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేశారు. ఈ చిత్రం తొలి షో నుంచే డీసెంట్​ టాక్​ అందుకుంది. దీంతో విడుదలకు ముందు ఏ స్థాయిలో అయితే జోరు కనిపించిందో ఇప్పుడు అంతకు రెట్టింపు స్థాయిలో దేవర జోరు నడుస్తోంది.

వాస్తవానికి కోస్టల్ ఏరియాల్ బ్యాక్​డ్రాప్‌తో హై రేంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దర్శకుడు కొరటాల శివ కూడా తెరకెక్కించి తానేంటో నిరూపించుకున్నారు. దీంతో ఈ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్​పై ఫ్యాన్స్​ పాజిటివ్​, బ్లాక్ బస్టర్​ రివ్యూలు(Devara Review) ఇస్తున్నారు. ఆలానే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా భారీగానే వస్తాయని ఆశిస్తున్నారు.

Devara OTT Platform :అయితే ఎంత పెద్ద సినిమా అయినా సరే కొద్ది రోజులకు ఓటీటీ బాట పడుతుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయా ఓటీటీ సంస్థలు కూడా రిలీజ్​కు ముందే సదరు చిత్రాలతో భారీ మొత్తానికి డీల్స్​ను కుదుర్చుకుంటున్నాయి. అలా ఇప్పుడు దేవర చిత్రానికి నెట్​ఫ్లిక్స్​ లాక్​ చేసుకున్నట్లు తెలిసింది. టైటిల్​ కార్డ్స్​లో ఈ విషయాన్ని అఫీషియల్​గా తెలిపారు మేకర్స్​.

ఈ చిత్రాన్ని థియేటర్​ రిలీజ్​ అనంతరం 50 రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్​ అయ్యేలా ఈ ఒప్పందం చేసుకున్నారని తెలిసింది! అంటే ఈ లెక్కన నవంబర్ మూడో వారంలో ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రావచ్చు.

కాగా, జనత గ్యారేజ్​ లాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో వచ్చిన చిత్రమిది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. బీటౌన్ స్టార్ యాక్టర్​ సైఫ్ అలీ ఖాన్ విలన్​గా కనిపించి మెప్పించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. అనిరుథ్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్​గా నిలిచింది. శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.

23 ఏళ్ల రాజమౌళి ఫ్లాప్​ సెంటిమెంట్​కు ఎన్టీఆర్​​ బ్రేక్ - ఏ రోజైతో మొదలైందో అదే రోజు క్లోజ్! - Rajamouli Flop Sentiment Devara

ఎన్టీఆర్​ 'దేవర' మూవీ రివ్యూ - ఎర్ర సముద్రం పోటెత్తింది! - DEVARA MOVIE REVIEW

ABOUT THE AUTHOR

...view details