తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

డెంటిస్ట్ టు ప్రొఫెషనల్ డ్యాన్సర్- క్రికెటర్ భార్యకు కోట్లలో 'యూట్యూబ్' లాభాలు! - ధనశ్రీ వర్మ డ్యాన్స్

Dentist To Professional Dancer : తన కల నెరవేర్చుకునేందుకు ఓ స్టార్ తన కెరీర్​ను వదులుకున్నారు. డెంటిస్ట్​గా ఉన్న ఆమె డ్యాన్స్ వైపుకు అడుగులేశారు. తన స్టెప్పులతో నెటిజన్లను అలరిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే?

Dhanasree Verma Dance
Dhanasree Verma Dance

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 8:44 PM IST

Dentist To Professional Dancer : డాక్టర్లుగా ఉన్న కొంతమంది సడెన్​గా యాక్టర్లుగా అయినవాళ్లను మనం చాలామందినే చూసుంటాం. ఓ వైపు తమ కెరీర్​లో బెస్ట్​ పొజిషన్​లో ఉంటూనే తమ డ్రీమ్స్​ను ఫుల్​ఫిల్ చేసుకునేందుకు సినిమాల్లోకి అడుగుపెట్టి రాణించినవారిని చూశాం. ఇదే కోవకు చెందిన ఓ స్టార్ ఇప్పుడు తన డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్​కు తనదైన స్టైల్​లో స్టెప్పులేస్తూ అలరిస్తున్నారు. యూట్యూబ్​లో వాటిని అప్​లోడ్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు. ఇటీవలే ఓ రియాల్టీ షోలో తన డ్యాన్స్ మూవ్స్​తో బుల్లితెర ఆడియెన్స్​ను అలరించారు.

డెంటిస్ట్​గా కెరీర్​ ప్రారంభించిన ఆ స్టార్ ఇప్పుడు ఓ ప్రొఫెషనల్ డ్యాన్సర్​గా మారి నెట్టింట సందడి చేస్తున్నారు. ఇంతకీ ఆమెవరో కాదు టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ. 1996లో జన్మించిన ధనశ్రీ డ్యాన్స్​పై తనకున్న మక్కువతో ఈ ఫీల్డ్​లోకి వచ్చారు. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ట్రెండ్ అయ్యారు. పొడవాటి జట్టు, క్యూట్ లుక్స్​తో పాటు సూపర్ డ్యాన్స్ మూవ్స్​తో ఆడియెన్స్​ను ఆకట్టుకున్నారు.

ఇక ధనశ్రీ యూట్యూబ్‌లో దాదపు 2.5 మిలియన్లకు పైగా సబ్​స్క్రైబర్లు ఉన్నారు. దీని ద్వారా ఆమె కోట్లలో సంపాదిస్తున్నారని సమాచారం. వీటితో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, కొరియోగ్రఫీ ద్వారా ఆమె సంపాదిస్తున్నారట. మార్కెట్ వర్గాల టాక్ ప్రకారం ప్రస్తుతం ధనశ్రీ నికర విలువ 3 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.24 కోట్లు అంట.

యుజు - ధనశ్రీ లవ్ స్టోరీ 'అలా మొదలైంది' :
లాక్‌డౌన్‌ సమయంలో డ్యాన్స్‌ నేర్చుకోవాలనే ఆసక్తితో చాహల్ మొదటగా ధనశ్రీకి మెసేజ్‌ చేశాడట. అప్పటికే సోషల్ మీడియాలో ధనశ్రీ డ్యాన్స్‌ను చూశాడట చాహల్. 'ఆ తర్వాత ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యాయి. మొదటి రెండు నెలలు డ్యాన్స్ గురించి తప్ప ఇతర విషయాలేమీ వారు మాట్లాడుకోలేదు. అప్పటికి ఇద్దరి మధ్య స్నేహం కుడా లేదు' అని చాహల్ తెలిపాడు. మహమ్మారి విలయం సృష్టిస్తోన్న సమయంలోనూ ధనశ్రీ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉండటం తనను ఆకట్టుకుందని చాహల్​ పేర్కొన్నాడు. ఇంత ఉత్సాహంగా ఎలా ఉంటురని ధనుశ్రీ అడిగాడట చాహల్​. అప్పటినుంచే ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయని చాహల్​ చెప్పాడు.

'ధనశ్రీ తీరు నాకు నచ్చింది. నా మాదిరే ఆమె కూడా స్వశక్తితో ఎదిగింది. ఆమెను ఇష్టపడుతున్నానని చాహల్​ వాళ్ల అమ్మకు కూడా చెప్పా' అని చాహల్ తెలిపాడు. 'డేట్‌ చేయాలని లేదు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ధనశ్రీని కూడా నేరుగానే అడిగేశా' అని తెలిపాడు. 'ప్రస్తుతం కాలంలో కూడా నేరుగా పెళ్లి ప్రస్తావన తీసుకురావడం సానుకూల ముద్ర వేసింది. అలా అడగడటమే ధనశ్రీకి బాగా నచ్చింద'ని చెప్పాడు. 'డ్యాన్స్‌ నేర్చుకునే విషయంలో చాహల్‌ ఎంతో ఉత్సాహం, శ్రద్ధ కనబర్చేవాడు. నాకు ఆ తత్వం నచ్చింద'ని ధనశ్రీ తెలిపింది. 'పెళ్లి విషయంలో నాపై ఎప్పుడూ ఒత్తిడి లేదు. జీవితంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను' అని ధనశ్రీ తెలిపింది.

చాహల్​ అందుకే నవ్వుతూ ఉంటాడు.. నేనతడి ఫస్ట్​ లవ్​ కాదు: ధనశ్రీ

ఊర్వశిరౌతేలాపై చాహల్ భార్య ఫన్నీ పోస్ట్​.. అందుకే పెట్టిందా?

ABOUT THE AUTHOR

...view details