తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దీపికా పదుకొణె - 'కల్కి' కన్నా ముందే నటించిన తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా? - Deepika Padukone Kalki 2898 AD

Deepika Padukone Kalki 2898 AD : తెలుగు చిత్ర పరిశ్రమకు కల్కి సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది దీపికా పదుకొణె. మరి ఈ భామ కల్కి కన్నా ముందే ఓ తెలుగు సినిమాలో నటించిందని మీకు తెలుసా? దాని గురించే ఈ కథనం.

దీపికా పదుకొణె - కల్కి కన్నా ముందే నటించిన తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?
దీపికా పదుకొణె - కల్కి కన్నా ముందే నటించిన తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 10:52 AM IST

Updated : Mar 16, 2024, 2:36 PM IST

Deepika Padukone Kalki 2898 AD : తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్‌ బ్యూటీస్​లో హీరోయిన్​ దీపికా పదుకొణె ఒకరు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీతో ఆమె ఇక్కడి తెరపై సందడి చేయనుంది. అయితే నిజానికి దీపికా పదుకొణె కొన్నాళ్ల క్రితమే తెలుగు తెరపై సందడి చేయాల్సింది. కానీ అది కుదరలేదు.

ఇంతకీ ఆ సినిమా ఏంటంటే? బావగారూ బాగున్నారా, ప్రేమించుకుందాం రా, టక్కరి దొంగ, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు​ జయంత్‌ సి. పరాన్జీ. ఆయన రణ్‌దీప్‌, మృదులతో కలిసి లవ్‌ 4 ఎవర్‌అనే చిత్రాన్ని రూపొందించారు. ఇందులోనే ఓ స్పెషల్ సాంగ్​లో దీపిక నటించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్ కాలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులను డైరెక్ట్​గా పలకరించే ఛాన్స్​ను అప్పుడు మిస్ అయిపోయింది దీపిక. అనంతరం మళ్లీ ఇప్పుడు కల్కి 2898ఏడీ సినిమాతో మే 9న హాయ్ చెప్పనుంది.

కాగా, కన్నడ చిత్రం ఐశ్వర్యతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు దీపికా పదుకొణె. అనంతరం ఓం శాంతి ఓంతో బాలీవుడ్‌ తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత రేస్‌ 2, కాక్‌టైల్‌, బాజీరావ్‌ మస్తానీ, చెన్నై ఎక్స్‌ప్రెస్, పఠాన్‌ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో వైవిధ్య పాత్రలు పోషించి ఆడియెన్స్​కు బాగా దగ్గరయ్యారు. ధమ్‌ మారో ధమ్‌, బిల్లూ, రాబ్తా, బాంబే టాకీస్‌, సర్కస్‌ చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌లో చిందులేసి అలరించారు. ప్రస్తుతం కల్కితో పాటు సింగం అగైన్‌ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇక కల్కి సినిమా విషయానికొస్తే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్​తో సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందనుంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దీనిని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌, యూనివర్సల్ స్టార్ కమల్‌ హాసన్‌, బోల్డ్ బ్యూటీ దిశా పటానీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు నుంచి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మహాభారతం రిఫరెన్స్​ తీసుకుని తెరకెక్కిస్తున్నారు.

రష్మికను అలా పిలిచిన ఆనంద్ దేవరకొండ - హ్యాపీగా ఫీలవుతున్న ఫ్యాన్స్​!

సింపుల్​గా హీరో వెంకటేశ్‌ రెండో కుమార్తె వివాహం - ఎవరెవరు హాజరయ్యారంటే?

Last Updated : Mar 16, 2024, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details