తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

షారుక్​ - నయన్ - సందీప్ వంగాకు ప్రతిష్టాత్మక అవార్డ్స్​ - దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్స్

Dadasaheb Phalke International film festival awards 2024 :దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌)- 2024 అట్టహాసంగా జరిగింది. ఆ వివరాలు.

షారుక్​ - నయన్ - సందీప్ వంగాకు ప్రతిష్టాత్మక అవార్డ్స్​
షారుక్​ - నయన్ - సందీప్ వంగాకు ప్రతిష్టాత్మక అవార్డ్స్​

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 7:21 AM IST

Updated : Feb 21, 2024, 7:43 AM IST

Dadasaheb Phalke International film festival awards 2024 : ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగే పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాల్లో దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌) కూడా ఒకటి. తాజాగా ఈ వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో పలువురు సినీ తారలు విచ్చేసి సందడి చేశారు. అవార్డులను అందుకున్నారు. ఫొటోలకు పోజులిచ్చారు.

ఈ ముగ్గురు స్పెషల్ అట్రాక్షన్​గా : గతేడాది డిసెంబర్‌లో రిలీజై బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్న చిత్రం యానిమల్‌. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్‌ వంగాకు ఉత్తమ దర్శకుడిగా పురస్కారం దక్కింది. అలాగే కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన జవాన్‌ చిత్రానికి రికార్డ్​ స్థాయిలో వసూళ్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో కథానాయకుడిగా నటించిన షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా, హీరోయిన్​గా నటించిన నయనతారకు ఉత్తమ నటి అవార్డులు దక్కాయి. ఈ ముగ్గురు వేడుకలో ప్రత్యేక ఆకర్షనగా నిలిచారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నారు. అభిమానులు, ప్రేక్షకులు వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు.

విజేతలు వీరే..

  • ఉత్తమ నటుడు - షారుక్ ఖాన్(జవాన్)
  • ఉత్తమ నటి - నయనతార(జవాన్)
  • ఉత్తమ నటుడు (నెగెటివ్‌ రోల్‌)- బాబీ దేవోల్‌ (యానిమల్‌)
  • క్రిటిక్స్‌ ఉత్తమ నటుడు - విక్కీ కౌశల్‌ ( సామ్‌ బహదూర్‌)
  • ఉత్తమ గీత రచయిత - జావేద్‌ అక్తర్‌ ( నిక్లే ది కభి హమ్‌ ఘర్‌సే ధున్కీ)
  • ఉత్తమ సంగీత దర్శకుడు - అనిరుధ్‌ రవిచందర్‌
  • ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (Male) - వరుణ్‌ జైన్‌
  • ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ ( Female) - శిల్పా రావు
  • ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ - యేసుదాసు
  • ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ - మౌషుమీ ఛటర్జీ

టెలివిజన్‌ విభాగం

  • టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ది ఇయర్‌ - ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌
  • ఉత్తమ నటుడు - నెయిల్‌ భట్ (ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌)
  • ఉత్తమ నటి - రూపాలీ గంగూలీ (అనుపమ)
Last Updated : Feb 21, 2024, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details