Daaku Maharaj OTT Release :నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన వహించిన చిత్రం 'డాకు మహారాజ్'. శ్రద్ధా శ్రీనాథ్, బాబీ దేవోల్, ప్రజ్ఞా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీ వెర్షన్ కూడా మంచి టాక్ అందుకుంది.
అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్‌ఫ్లిక్స్' అభిమానుల కోసం ఓ గుడ్ న్యూస్ తెలిపింది. 'డాకు మహారాజ్' స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.
స్టోరీ ఏంటంటే?
చిత్తూరు జిల్లా మదనపల్లిలో స్టార్ట్ అవుతుంది ఈ కథ. అక్కడ కాఫీ ఎస్టేట్‌కి అధిపతి అయిన కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్) విద్యాసంస్థల్ని నడుపుతుంటాడు. అతడికి తన మనవరాలు వైష్ణవి అంటే ఎంతో ప్రాణం. చిన్నప్పుడే తల్లి చనిపోవడం వల్ల ఆ పాపకి అన్నీ తామై కుటుంబమంతా అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. అటువంటి పాప ప్రాణాలకి లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తులు (రవికిషన్) నుంచి ముప్పు ఏర్పడుతుంది. దాంతో ఆ ఇంట్లోనే పనిచేస్తున్న తన సైన్యం నుంచి భోపాల్‌లో ఉన్న మహారాజ్ (బాలకృష్ణ)కి వర్తమానం అందుతుంది.