నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'డాకు మహారాజ్' సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ఓ ప్రెస్ మీట్‌ను నిర్వహించి సినిమా గురించి పలు కీలక విషయాలు చెప్పుకొచ్చారు. అందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, సూర్యదేవర నాగవంశీ, బాబీ హాజరై సందడి చేశారు.
ఫ్లాష్‌బ్యాక్‌లో ఆ పాత్ర ఎఫెక్ట్ చాలా ఉంది : బాబీ
బాలకృష్ణ అభిమానులకి గుర్తుండిపోయే ఓ సినిమా ఇవ్వాలనేది నిర్మాత నాగవంశీ కల. అందుకు తగ్గట్టుగానే ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తూ ఈ సినిమాని రూపొందించాం. బాలకృష్ణని ఇందులో కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం. ఐదు యాక్షన్ సీన్స్ ఉంటాయి. ప్రతి ఘట్టం కూడా అభిమానులకి ఓ ప్రత్యేకమైన అనుభూతిని పంచుతుంది. మంచి కామెడీ, ఎమోషన్స్‌తో అభిమానులకే కాకుండా, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే డాకు మహారాజ్ రోల్ సెకెండాఫ్‌లో కీలకం కానుంది.
ఈ సక్సెస్ నా బర్త్‌డే గిఫ్ట్ : ప్రగ్యా జైస్వాల్
సినిమా రిలీజయ్యే రోజూ నా బర్త్‌డే. అందుకే ఈ సినిమా సక్సెస్ నాకు ఓ పెద్ద గిఫ్ట్. ఇందులో నేను ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రని పోషించాను.