తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది : అనన్య పాండే - CTRL MOVIE ANANYA PANDAY

Ananya Pandey CTRL Movie : తనకు ఏ డైరెక్టర్​తో కలిసి సినిమా చేయాలని ఉందో చెప్పిన అనన్య పాండే.

source ETV Bharat
ananya pandey (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2024, 8:53 PM IST

Ananya Pandey CTRL Movie : 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2', 'డ్రీమ్‌ గర్ల్‌ 2', 'లైగర్‌' వంటి సినిమాలతో యూత్​లో ఫాలోయింగ్ పెంచుకుంది యంగ్ హీరోయిన్ అనన్య పాండే. ముఖ్యంగా 'లైగర్'​తో తెలుగు యూత్​ ఆడియెన్స్​లో మరింత క్రేజ్ పెంచుకుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా 'కంట్రోల్‌' అనే చిత్రంతో అలరించింది అనన్య పాండే. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తనకు ఎలాంటి సినిమాల్లో నటించాలని ఉంది, ఏ బాలీవుడ్‌ డైరెక్టర్స్​తో సినిమా చేయాలనుకుంటోంది వంటి విషయాలను బయట పెట్టింది.

"కరణ్‌ జోహర్‌ తెరకెక్కించి చిత్రంలో హీరోయిన్‌గా నటించాలని నా కోరిక. ఆయన డైరెక్షన్​లో విడుదలైన రాకీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీలో చిన్న పాత్ర పోషించాను. కానీ, నాకు ఆయన చిత్రంలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా సంజయ్‌ లీలా భన్సాలీ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నాకు ఇష్టమైన దర్శకుడు. సంజయ్‌ చిత్రంలో అవకాశం రావాలని కోరుకుంటున్నాను. కెరీర్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకు పలు జానర్‌ సినిమాల్లో యాక్ట్ చేశాను. హారర్‌, రొమాంటిక్‌ బయోపిక్‌లలో నాకు ఎక్కువగా నటించాలని ఉంది. ప్రస్తుతం కెరీర్‌ పరంగా చాలా బిజీగా ఉన్నాను. నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను" అంటూ అనన్య తన మనసులోని మాట చెప్పింది.

ఇదిలా ఉండగా, ఇదే ఇంటర్వ్యూలో తన సోషల్‌ మీడియా అకౌంట్‌ గురించి కూడా మాట్లాడింది అనన్య పాండే. "చిన్నప్పుడు ఓ ఫేస్‌ బుక్‌ అకౌంట్​ను ఓపెన్‌ చేశాను. అది మా అమ్మకు తెలిసింది. దీంతో దాన్ని డీ యాక్టివేట్‌ చేసింది. 18 సంవత్సరాలు నిండిన తర్వాతే మళ్లీ సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాను. విశ్రాంతి సమయంలో సోషల్‌ మీడియాలో ఉండడానికి ఇష్టపడుతుంటాను. నాకు నచ్చిన చిత్రాల గురించి ఫ్యాన్స్​తో షేర్ చేసుకుంటాను." అని చెప్పింది.

'నా కూతురు లిటిల్ సింబా' - కుమార్తె గురించి తొలిసారి స్పందించిన రణ్‌వీర్‌

రజనీ కాంత్ వేలు పెట్టడం వల్లే నా సినిమా ఫ్లాప్!​ - ప్రముఖ దర్శకుడు ఆరోపణలు - Rajinikanth Flop Movie

ABOUT THE AUTHOR

...view details