Crime Thriller Series In OTT : ఇండియాలోని పాపులర్ వెబ్‌సిరీసుల్లో మీర్జాపుర్ ఒకటి. రిలీజైన అన్ని భాషల్లోనూ ఇది సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇప్పటికే రెండు సీజన్లతో అలరించిన ఈ సిరీస్ ఇప్పుడు 'మీర్జాపుర్' 3గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమ్ అవుతోంది. అయితే మీరు ఈ మూడు సీజన్లను కంప్లీట్ చేసుంటే నెట్టింట అలాంటి థ్రిల్లింగ్, రోలర్‌కోస్టర్ రైడ్ లాంటి ఫీలింగ్ అందించే వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. వాటినీ ఓ లుక్కేయండి మరి.
ఆర్య (డిస్నీ+ హాట్‌స్టార్)
ఆర్య సరీన్ అనే మహిళ డ్రగ్స్ వ్యాపారంలోకి బలవంతంగా అడుగుపెడుతుంది. అయితే ఆ తర్వాత అందులో ఆమె సెటిల్ అయిపోతుంది. అయితే తన కుటుంబంతో పాటు తన సామ్రాజ్యాన్ని నాశనం చేయాలనుకునే ఓ కొత్త శత్రువును ఎదుర్కొంటుంది. మరి ఆమె ఆ శత్రువు నుంచి తన కుటుంబాన్ని కాపాడుతుందా? ఈ సమాధానం తెలియాలంటే మీరు ఈ సిరీస్ తప్పక చూడాల్సిందే.
సేకర్డ్ గేమ్స్ (నెట్‌ఫ్లిక్స్)
సమస్యల్లో ఉన్న పోలీసు సర్తాజ్ సింగ్ (సైఫ్ అలీ ఖాన్)కి ముంబయిని రక్షించడానికి 25 రోజుల సమయం మాత్రమే ఉందని ఓ కాల్ వస్తుంది. అయితే తక్కువ టైమ్ తన వద్ద ఉన్నందున అతనికి ఎక్కడి నుంచి పని మొదలు పెట్టాలో అర్థం కాదు. క్రైమ్ బాస్ గణేష్ గైటోండే (నవాజుద్దీన్ సిద్ధిఖీ) గైడెన్స్‌లో చీకటి సామ్రాజ్యంలో గ్యాంగ్‌స్టర్స్‌ని ఏరివేయడాన్ని ప్రారంభిస్తాడు. చివరికి తన మిషన్‌లో సక్సెస్ అయ్యాడా? మధ్యలో ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి? ఇటువంటివి సిరీస్‌లో చూసేయండి.
నార్కోస్ (నెట్‌ఫ్లిక్స్)
హింస, ఘోరాలతో నిండి ఉంటుంది ఈ సిరీస్. ముఖ్యంగా అగ్రస్థానం కోసం అందరూ పోరాడటం ఆసక్తి రేపుతుంది. 2015లో విడుదలైన ఈ సిరీస్ ఇప్పటికీ పాపులర్ అవుతూనే ఉంది.