Cricketers At Anant Ambani Pre Wedding Bash :అంబానీ ఇంట పెళ్లి సందడి చాలా గ్రాండ్‌గా జరుగుతోంది. మూడు రోజుల పాటు ఈ జరగనున్న ఈ వేడుకల్లో భాగంగా తాజాగా ప్రీ వెడ్డింగ్ బాష్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో సినీ, పారిశ్రామిక, రాజకీయ, క్రీడ ఇలా వివిధ రంగాలకు చెందిన స్టార్స్ ఈ పార్టీలో పాల్గొని సందడి చేశారు. అయితే అందులో మన క్రికెటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇక ఈ వేడుకల్లో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఎంఎస్ ధోనీ దంపతులు, వెస్టిండీస్ క్రికెటర్ కిరిన్ పొలార్డ్ దంపతులు, జహీర్ ఖాన్, డీజే బ్రావో ఇలా పలుపురు స్టార్స్ ఈ వేడుకకు హాజయ్యారు. ఎప్పుడూ జెర్సీల్లో కనిపించే ఆ స్టార్స్ పార్టీ లుక్‌లో చాలా డిఫరెంట్‌గా కనిపించి ఆకట్టుకున్నారు.
Celebrities At Anant Ambani Wedding : మరోవైపు సినీ సెలబ్రిటీలు కూడా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మెరిశారు. అందులో నటులు సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీ, జాన్వీ కపూర్, అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్, దీపిక పదుకుణె రణ్వీర్ సింగ్ జంట, ఆలియా భట్ సోనమ్ కపూర్ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.