CREW Movie OTT Release Date :ఓటీటీలో ఈ వీకెండ్ ఆడియెన్స్‌ను అలరించేందుకు మరో సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రం రాబోతోంది. అదే క్రూ(Crew). సీనియర్ నటీమణులు టబు, కరీనా కపూర్‌తో పాటు యంగ్ బ్యూటీ కృతి సనన్ కలిసి ఈ సినిమాలో తమ అందాలను ఆరబోస్తూనే తెగ నవ్వించారు. స్మగ్లింగ్ సాహసాలు చేశారు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇక ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బంగారం స్మగ్లింగ్ చేసే ముగ్గురు ఎయిర్ హోస్టెస్‌ల చుట్టూ ఈ కథ సాగుతుంది. నష్టాల్లో ఉన్న ఓ ఎయిర్ లైన్స్‌లో టబు, కరీనా కపూర్, కృతి సనన్ పని చేస్తుంటారు. ఎప్పటికైనా తమ జీతాలు పెరిగి జీవితాలు మారుతాయని ఆశతో ఉంటారు. కానీ అదే సమయంలో ఎయిర్ లైన్స్ దివాళా తీస్తుంది. దీంతో అప్పటి నుంచి కస్టమ్స్ వారి కళ్లు గప్పి బంగారం స్మగ్లింగ్ చేస్తూ సంపాదిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. మరి వీళ్ల స్మగ్లింగ్ దందా ఎంత కాలం సాగింది? చివరికి జైలుకు వెళ్లారా? లేదా అనేదే కథ. సినిమా మొత్తం వీరి గ్లామర్‌తో పాటు ఫుల్ కామెడీ ఉంటుంది.
కాగా, ఈ చిత్రానికి రాజేష్ ఎ కృష్ణన్ దర్శకుడు. బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ సంయుక్తంగా నిర్మించాయి. మరి థియేటర్లలో భారి విజయం అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా చూడాలి.