Coolie Rajinikanth Birthday Special Video :కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'కూలి'. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే గురువారం రజనీ బర్త్‌డే కానుకగా మేకర్స్ అభిమానులకు ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో నుంచి 'చిటుకు వైబ్' అనే సాంగ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అందులో రజనీ ఎప్పటిలాగే కూల్ స్టెప్స్‌తో అలరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
ఇక 'కూలీ' సినిమా విషయానికి వస్తే, బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఓ స్టోరీని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. మూవీ టీమ్ కూడా లేటెస్ట్ అప్డేట్స్తో సందడి చేస్తోంది. ఇప్పటికే ఇందులో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, తాజాగా బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 2025 సమ్మర్కల్లా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ రివీల్ వీడియోలో వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంది.