తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్​ను అలా అస్సలు పిలవకూడదు! : చియాన్ విక్రమ్ - Chiyaan Vikram comments on Prabhas - CHIYAAN VIKRAM COMMENTS ON PRABHAS

Chiyaan Vikram Comments On Prabhas : 'తంగలాన్​' చియాన్​ విక్రమ్​ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​పై క్రేజీ కామెంట్స్​ చేశారు. ఏం అన్నారంటే?

source ETV Bharat
Chiyaan Vikram Comments On Prabhas (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2024, 11:58 AM IST

Chiyaan Vikram Comments On Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ ప్రస్తుతం వరల్డ్​ వైడ్​గా అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన సినిమా రిలీజ్​ అవుతుందంటే తొలి రోజే రూ.100 నుంచి రూ.170 కోట్ల వరకు వసూలు అవ్వడం పక్కా! ఇప్పుడాయన సలార్​, కల్కి 2898 ఏడీతో వరుస విజయాలను అందుకుని సరికొత్త రికార్డులు సొంతం చేసుకున్నారు.

అయితే తాజాగా ప్రభాస్​పై కోలీవుడ్​ స్టార్​, విలక్షణ హీరో విక్రమ్​ చేసిన కామెంట్స్​ వైరల్​గా మారాయి. ఆయన డార్లింగ్​పై ప్రశంసల వర్షం కురిపించారు. "ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయన్ను ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే అనడం సరికాదు." అని విక్రమ్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్​ ప్రస్తుతం డార్లింగ్ ఫ్యాన్స్​లో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. దీంతో వారు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

అనంతరం విక్రమ్​ తంగలాన్​లో నటించిన మాళవిక మాట్లాడుతూ "ప్రభాస్‌తో కలిసి నటించే ఛాన్స్​ రావడం ఆనందంగా ఉంది. భాషపరంగా సినిమా సరిహద్దులను ఆయన తొలగించారు. ఆయన నటించిన చిత్రాలపై ప్రేక్షకులు చూపే అభిమానం చూస్తే ఆశ్చర్యంగా ఉంది" అని చెప్పారు. రాజాసాబ్‌ కూడా పాన్‌ ఇండియా ఫిల్మ్‌ అని చెప్పుకొచ్చారు.

Rajasaab Movie Shooting Update : ఈ ఏడాది 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్​ను ఖాతాలో వేసుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం వరుస పాన్‌ ఇండియా చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన నుంచి రాబోతున్న చిత్రాల్లో 'రాజాసాబ్‌' కూడా ఒకటి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ఈ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్​పై నిర్మాత శ్రీనివాస కుమార్‌ అప్డేట్ ఇచ్చారు. "ప్రభాస్‌ పాత్రకు సంబంధించి షూటింగ్ పూర్తైంది. మూవీ షూటింగ్‌ కూడా పూర్తైంది." అని ఓ నెటిజన్‌ పోస్ట్​ చేయగా దానికి నిర్మాత శ్రీనివాస కుమార్‌ (ఎస్‌కెఎన్‌) బదులిచ్చారు.

"ప్రభాస్‌ పాత్ర కంప్లీట్ అయితే సినిమా షూటింగ్ అంతా పూర్తైనట్లు కాదు కదా!" అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్​ శరవేగంగా జరుగుతోందని చెప్పారు. కాగా, రొమాంటిక్‌ హారర్‌ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సినిమాలో మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

పవన్​ అందుకే 'ఖుషి' సీక్వెల్ ఒప్పుకోలేదు - అసలు కారణం చెప్పిన ఎస్​ జే సూర్య - SJ SURYAH Kushi SEQUEL

'పెళ్లి ఎప్పుడు, ఎక్కడ చేసుకుంటారు?' - నాగ చైతన్య సమాధానమిదే - Naga chaitanya Marriage

ABOUT THE AUTHOR

...view details