తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'జై హనుమాన్​'లో చిరు - మహేశ్​ : అసలు విషయం చెప్పేసిన ప్రశాంత్ వర్మ! - హనుమాన్​గా చిరంజీవి

Chiranjeevi Mahesh Babu Hanuman Movie : 'జై హనుమాన్​'లో చిరు - మహేశ్​ బాబు నటించే అవకాశముందని చెప్పారు దర్శకుడు ప్రశాంత్ వర్మ! ఆ వివరాలు.

'జై హనుమాన్​'లో చిరు - మహేశ్​ : అసలు విషయం చెప్పేసిన ప్రశాంత్ వర్మ
'జై హనుమాన్​'లో చిరు - మహేశ్​ : అసలు విషయం చెప్పేసిన ప్రశాంత్ వర్మ

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 6:26 PM IST

Chiranjeevi Mahesh Babu Hanuman Movie : చిన్న సినిమాగా రిలీజై పాన్ ఇండియా రేంజ్​లో సక్సెస్ అందుకున్న చిత్రం 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ డైరెక్షన్​లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే దాదాపు రూ. 300 కోట్ల రూపాయల కలెక్షన్లకు చేరువగా వచ్చింది. అయితే హనుమాన్ మూవీ ఎండింగ్​లో సెకండ్ పార్ట్​కు లీడ్ ఇస్తూ 'జై హనుమాన్' సీక్వెల్​ను మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే​. 'రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి?' అనే క్వశ్చన్​తో ఫస్ట్ పార్ట్​ను ముగించారు. దీంతో రెండో భాగం జై హనుమాన్​పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అలా సీక్వెల్​లో హనుమాన్ పాత్రను ఓ స్టార్ హీరో నటిస్తారని ఈ మధ్యే ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. దీంతో అంచనాలు మరింత పెరిగాయి. ఆ పాత్రలో ఎవరో నటిస్తారో అన్న క్యూరియాసిటీ కూడా బాగా పెరిగింది. అలాగే రాముడిగా ఎవరు కనిపిస్తారనే ప్రశ్న కూడా అందరి మదిలో మెదిలింది. ఈ నేపథ్యంలో ఆ రెండు గొప్ప పాత్రల్లో ఎవరు నటిస్తే బాగుంటుందో తన మనసులో మాటలను బయటపెట్టారు ప్రశాంత్ వర్మ. తాజాగా మరో ఇంటర్వ్యూలో హనుమంతుడి పాత్ర కోసం మెగాస్టార్​ చిరంజీవిని తీసుకుంటే బాగుంటుందని తాను అనుకుంటున్నట్లు చెప్పారు.

'గ్రాఫిక్స్​లోనే చిరంజీవి గారి కళ్లు చూపించారు. మరి అవకాశం ఉందా' అని యాంకర్ అడగగా.. "హనుమాన్​గా చిరంజీవి గారు కనిపించే అవకాశాలు ఉన్నాయి. మూవీ రిలీజ్ తర్వాత ఆయన్ను మేము మళ్ళీ కలవలేదు. ఆయన పద్మవిభూషణ రావడంతో బిజీగా ఉన్నారు. పెద్దవాళ్లు వెళ్లి కలుస్తున్నారు. మేం తర్వాత వెళ్లి కలుస్తాము." అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.

ఇక రాముడి పాత్ర గురించి కూడా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ "రాముడి పాత్రను మహేశ్​ బాబు చేస్తే బాగుంటుందని నా మైండ్​లో ఉంది. ఆల్రెడీ మా ఆఫీస్​లో మహేశ్​ బాబును గ్రాఫిక్స్​లో రాముడిగా డిజైన్ చేసి చూసుకున్నాము. చూడాలి మరి తర్వాత ఏం జరుగుతుందో." అని చెప్పుకొచ్చారు.

'హనుమాన్' సక్సెస్​ - ఆ స్టార్ హీరోతో వరలక్ష్మీ శరత్​కుమార్ పెళ్లి!

గడ్డకట్టే చలిలో మహేశ్​ ట్రెక్కింగ్ - ఇదంతా ఆ సినిమా కోసమేనా ?​

ABOUT THE AUTHOR

...view details