Chaitanya Jonnalagadda Reaction On Niharika Divorce Interview :చైతన్య జొన్నలగడ్డ- నిహారిక కొణిదెల కొద్ది నెలల ముందువరకు భార్యాభర్తలు. పలు వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ గతేడాది కోర్టులో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో విడిపోయినప్పటి నుంచి తన వ్యక్తిగత జీవితంపై ఎక్కడా నోరు విప్పని నిహారిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఓ ప్రముఖ యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నిహారికతో చేసిన పాడ్‌కాస్ట్ వీడియోను తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు యాంకర్. ప్రస్తుతం ఈ కామెంట్స్‌పైనే ఘాటుగా స్పందించారు ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ.
మాజీ భర్త రియాక్షన్!
'ఇటీవల నిహారికపై జరుగుతున్న అన్యాయమైన నెగిటివిటీని దూరం చేయడానికి మీరు చేసిన ఈ ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తున్నా. ఇలాంటి నెగటివిటీ వల్ల ఏర్పడే పర్సనల్ ప్రెషర్‌ను ఫేస్ చేయడం అంత ఈజీ కాదనే విషయం నాకూ తెలుసు. అయితే పర్సనల్ లైఫ్‌కు సంబంధించి బాధితురాలి పక్షాన్నే మాట్లాడటం, వారి వెర్షన్‌నే వినిపించడం సరికాదు. ఇటువంటి వన్‌సైడ్ వెర్షన్లను ఇతరులకు మరింత చేరువ చేసేందుకు ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించడం మానేయాలి. ఇలా జరగడం ఇది రెండోసారి. పెళ్లి అయ్యాక ఇద్దరికీ సెట్ కాకపోవడం వల్ల కలిగే బాధ, తద్వారా దాని నుంచి బయటపడడం అనేది రెండువైపులా ఒకేవిధంగా ఉంటుంది' అంటూ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు చైతన్య జొన్నలగడ్డ.
'ఇద్దరి మధ్య జరిగిన విడాకుల విషయం గురించి అది కూడా ఆ ప్రక్రియ పూర్తైన తర్వాత దాని గురించి అస్సలు చర్చించకూడదు. మరీ ముఖ్యంగా దీనిపై ఒకరివైపు నుంచే మాట్లాడడం సరైంది కాదు. అయితే పెళ్లిబంధం విఫలమైన తర్వాత కలిగే బాధ గురించి, దాని నుంచి బయటకురావడం గురించి జనరలైజ్ చేసి మాట్లాడవచ్చు. ఈ చర్చ ఇతరులకు ఉపయోగపడవచ్చు. ఈ అంశంపై మీరు ప్రజలకు నిజంగా అవగాహన కల్పించాలనుకుంటే, రెండు వైపులా నుంచి నిజాలను తెలుసుకుంటే మంచిది. భవిష్యత్తులో ఇటువంటి ఇంటర్వ్యూలు చేసేముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాను. అలా అయితేనే పాడ్‌కాస్ట్‌లు చేయండి. కానీ, విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా ప్రజలకు అసత్యాలను ప్రచారం చేయడం అనేది అన్యాయం. నాణేనికి రెండువైపులా చూపిస్తేనే అది నిజం అవుతుంది తప్ప, ఒక్కసైడ్ మాత్రమే చూపించి అదే నిజమని చెబితే మీరు అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వాళ్లవుతారు. ఇదంతా మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నా. ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేసిన వీడియోకు కామెంట్ సెక్షన్లో రాసుకొచ్చారు.