Celebrities Born In Poverty: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్లు, ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా? ఒక్క అవకాశం కోసం వారు పడిన తపన అంతా ఇంతా కాదు. కింది స్థాయి నుంచి స్టార్‌గా ఎదిగేందుకు వారు ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఎన్ని కష్టాలొచ్చినా తెరపై వారిని కూడా చూసుకోవాలనే ఆశను వదులుకోకుండా కష్టపడే వారు చాలా తక్కువ మందే ఉంటారు. సినిమానే జీవితం ఇక్కడే తాడోపేడో తేల్చుకోవాలని భవిష్యత్త్ను పణంగా పెట్టి సక్సెస్ అయిన వాళ్లలో సూపర్ స్టార్ రజనీకాంత్ టాప్ అనే చెప్పాలి. అలా ఎన్నో అడ్డకుంలను ఎదుర్కొని స్టార్లుగా ఎదిగి ప్రేక్షకుల మనసులు గెలిచిన టాప్ హీరోలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- రజనీకాంత్:బస్ కండక్టర్ స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటులలో రజనీకాంత్ ముందుగా గుర్తొస్తారు. విలన్ రోల్స్ నుంచి మొదలుపెట్టి, హీరోగా సూపర్ స్టార్ రేంజ్‌కి ఎదిగారు. వయసు మీద పడిన తర్వాత కూడా హీరోగానే కనిపిస్తున్నారంటే అది తలైవారు ఉన్న క్రేజ్.
- మనోజ్ బాజ్‌పేయి: హిందీ, తెలుగు, తమిళం సహా దాదాపు ఇండియన్ భాషల్లోని సినిమాలన్నింటిలో నటించారు మనోజ్ బాజ్‌పేయి. ఆయన నటించిన అద్భుతమైన చిత్రాల్లో 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ఒకటి. ఆయన కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి గొప్ప స్థాయికి ఎదిగిన వారే. ఒకానొక పరిస్థితుల్లో వడాపావ్ కొనుక్కోవడానికి కూడా ఆయన దగ్గర డబ్బుల్లేవట. ముంబయిలోని ఓ చారాలో ఐదుగురితో రూమ్ షేర్ చేసుకున్నారట. అలాంటిది ఇప్పుడు ముంబయిలోని ఒబెరాయ్ టవర్స్‌లో ఇల్లు కొనుగోలు చేశారు.0
- జాకీ ష్రాఫ్: ఒకప్పుడు ముంబయిలోని అద్దె ఇంట్లో నుంచి కెరీర్ మొదలుపెట్టిన జాకీ ష్రాఫ్, ఇప్పుడు అదే ముంబయిలో సీ ఫేసింగ్‌లో 8BHK అసార్ట్ మెంట్‌ను సొంతం చేసుకున్నారు.
- బొమన్ ఇరానీ:మున్నాభాయ్‌తో ఫేమస్ అయిన బొమన్ ఇరానీ ముంబయిలోని తాజ్ హోటల్ వెయిటర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత వాళ్ల నాన్నకి ఉన్న బేకరీ షాపులో కూడా హెల్పర్‌గా ఉండేవారు. అంతటి కష్టం అనుభవించిన ఇరానీ సొంత కాళ్లపై నిలబడి బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
- అక్షయ్ కుమార్:చాలా మందికి తెలిసినట్లుగా అక్షయ్ కుమార్ ఒక బ్యాంకాక్ రెస్టారెంట్లో వెయిటర్, డిష్ వాషర్. ఉండటానికి ఇల్లు కూడా లేని అక్షయ్ అదే హోటల్ నేలపై నిద్రపోయేవారట. రోజు గడవడానికి కష్టపడిన రోజుల నుంచి బాలీవుడ్ అత్యంత ధనవంతుల జాబితాలో చేరారంటే ఆయన కష్టమే కారణం.
- నవాజుద్దీన్ సిద్దిఖీ: ఉత్తరప్రదేశ్‌లోని సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి నవాజుద్దీన్ సిద్దిఖీ. ఆయనకు ఎనిమిది మంది తోబుట్టువులు. కెరీర్ కోసం ముంబయికి రాగానే పొట్ట తిప్పల కోసం వాచ్‌మెన్‌గా పనిచేశారు. ఆ తర్వాత తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా వాడుకుని ఒక హిస్టరీనే క్రియేట్ చేసుకున్నారు.
- జానీ లివర్:డబ్బుల్లేక తండ్రి స్కూల్‌కు పంపడం మాన్పిస్తే ఏడో తరగతితోనే చదువు ఆపేశారు జానీ లివర్. ముంబయి వీధుల్లో తిరిగి హిందీ నటుల వాయీస్ మిమిక్రీ చేసుకుంటూ కాలం గడిపేవారు. తెర మీద కనిపించాలన్న కసితో ఎంతో కష్టపడి ఆ స్థాయి నుంచి టాప్ కమెడియన్లలో ఒకరిగా మారారు.