Prabhas Spirit :పాన్ఇండియా స్టార్ ప్రభాస్- సందీప్‌రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కనున్న మూవీ 'స్పిరిట్'. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కిస్తుండడం వల్ల ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి ప్రీ పొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. అయితే మేకర్స్ నటీనటుల (Cast And Crew) ఎంపికపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో మేకర్స్ క్రేజీ అనౌన్స్మెంట్ చేశారు. సినిమాల్లో నటించేందుకు ఉత్సాహంగా ఉన్న ఆశావాహులను ఎంపిక చేసుకుంటామని తాజాగా ఓ ప్రకటన ఇచ్చారు.
'స్పిరిట్' సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ఆసక్తి గల నటీనటులందరూ సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 2 ఫొటోలు, 2 నిమిషాల నిడివితో ఉన్న వీడియో రికార్డ్ చేసి సంబంధింత మెయిల్‌కు పంపాలని కోరారు. ఈ మేరకు 'కాస్టింగ్ కాల్' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ షేర్ చేశారు. నటనపై ఆసక్తి ఉన్న వాళ్లకు ఇది బంపర్ ఆఫర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ ఎవరెవరికి దక్కుతుందో చూడాలి.