Cannes Film Festival 2024 Indian Movie :ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్‌గా సాగుతోంది. ఈ వేడుకల్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం పోటీలో నిలిచింది. అదే మలయాళీ సినిమా ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ (All We Imagine as Light). పామ్ డి ఓర్ (Palme d'Or) అవార్డుల కేటగిరీలో పోటీలో నిలిచింది. మే 23న ఈ సినిమాను స్క్రీనింగ్ చేశారు. మిడిల్ క్లాస్ యువతుల జీవితాలు, వారి భావోద్వేగాలతో ముడిపడిన ఈ చిత్రానికి విశేష ఆదరణ కూడా దక్కింది. అందరూ లేచి నిలబడి చప్పట్లతో ప్రశంసించారు. ఈ సందర్భంగా మూవీటీమ్ కూడా రెడ్ కార్పెట్‌పై మెరిసింది. దర్శకురాలు పాయల్ కపాడియాతో పాటు నటీనటులు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. డ్యాన్స్‌లు చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.
కాగా, పాయల్ కపాడియా దర్శకత్వం వచ్చిన తొలి ఫీచర్ సినిమా కూజా ఇదే కావడం విశేషం. అలానే ఈ కేన్స్‌లో భారత్ నుంచి ఓ ఫీచర్ ఫిల్మ్ పోటీలో నిలవడం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. గతంలో 1994లో స్వహం సినిమా పామ్ డి ఓర్ కేటగిరీలో పోటీ పడింది. మళ్లీ ఇప్పుడు ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ పోటీ పడుతోంది. దీంతో పాటు యోర్గోస్ లాంతిమోస్, ఓహ్ కెనడా, మెగాలోపోలిస్, అనోరా, బర్డ్ సహా తదితర సినిమాలు ఈ బరిలో నిలిచాయి. వీటిల్లో విజేతను మే 25న అనౌన్స్ చేయనున్నారు. అంతకుముందు పాయల్ కపాడియా తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్ 2021 కేన్స్‌లో ఉత్తమ డ్యాకుమెంటరీగా అవార్డను ముద్దాడింది.