Cannes Film Festival 2024: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టాప్ యాక్టింగ్ అవార్ బెస్ట్ యాక్టరస్ అవార్డును అందుకున్నారు అనసూయ సేన్‌గుప్తా. అది కూడా తొలిసినిమాతోనే. గోవాలో ఉంటూ ముంబయిలో ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసే ఆమెకు అన్ సర్టైన్ రిగార్డ్ సెగ్మెంట్‌లో ఉత్తమ నటి అవార్డు దక్కింది. బల్గేరియన్ డైరెక్టర్ కాన్‌స్టంటిన్ బొజనోవ్ తెరకెక్కించిన 'ద షేమ్ లెస్' సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు అనసూయ. ఈమెతో పాటు మితా వశిష్ట్ అనే ఫ్యామస్ యాక్టర్ కూడా ఇందులో నటించారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్‌ను నెలన్నర పాటు ఇండియా, నేపాల్‌లో చిత్రీకరించారు.
48 ఏళ్ల తర్వాత:77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శ్యామ్ బెనెగల్ నుంచి వచ్చిన మంతన్ తర్వాత 48ఏళ్లకు ఇండియన్ సినిమా షో పడింది. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో నటించి ఇంతటి గ్రాండ్ వేడుకలో అవార్డు అందుకున్న తొలి ఇండియన్‌గా నిలిచారు అనసూయ. ఆమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు అందుకుంటూ, దానిని క్వీర్ కమ్యూనిటీకి డెడికేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అవార్డును అందుకుంటున్న అనసూయ ఎమోషనల్ అవుతూనే 'చాలా కమ్యూనిటీల వారంతా తప్పనిసరి పరిస్థితుల్లో బతుకుతూ జీవితంతో పోరాడుతున్నారు. వలసవాదులు ఎంత దయనీయంగా బతుకుతున్నారో మనమంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది' అంటూ భావోద్వేగంతో ప్రసంగించారు.
ఫేస్‌బుక్‌లో ఆడిషన్:బొజనోవ్‌కు ఫేస్‌బుక్ ఫ్రెండ్ అనసూయ. ఒకసారి ఆమెను సర్‌ప్రైజ్ చేస్తూ ఆడిషన్ చేసి వీడియో పంపమని అడిగారు. యాక్టింగ్ అంటే తెలియన ఆమెకు ఆడిషన్ అదే ఫస్ట్ టైం. అలా సెలక్టైన ఆమె 'ద షేమ్ లెస్'లో నటించే అవకాశం కొట్టేసింది. ఇందులో ఒక సెక్స్ వర్కర్ అయిన రేణుకా పాత్ర పోషించారీమె.