Actor Nawazuddin Siddiqui Wife :బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికీ గురించి పరిచయం అవసరంలేదు. ఈ నటుడు తెలుగులో వెంకటేశ్ నటించిన సైంధవ్ మూవీలో విలన్‌గా యాక్ట్ చేసి ఆకట్టుకున్నారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. కానీ నవాజుద్దీన్‌కు నటనలో మార్కులు పడ్డాయి.
ఇక నవాజుద్దీన్ వ్యక్తిగత జీవితం గురించి చూస్తే ఆయన తన భార్య ఆలియాతో విడిపోయారన్న వార్తలు ఆ మధ్య చాలా వచ్చాయి. ఇద్దరు బహిరంగంగానే గొడవ పడేవారు. గొడవలతో తరచుగా వార్తల్లోకి ఎక్కేవారు. అలాగే తన భర్త తనను వేధిస్తున్నారని, ఆయన తల్లి ఇంట్లో నుంచి తన పిల్లలను తనని గెట్టేశారని ఆరోపిస్తూ ఆలియా అప్పట్లో కోర్టు మెట్లు కూడా ఎక్కింది. తన భర్తమీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. అంతేకాదు దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో నవాజుద్దీన్ సిద్ధిఖీ పేరు ఆ మధ్య మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వార్తలపై ఆయన కూడా స్పందించారు. ఆలియాతో తాను డివర్స్ తీసుకుని చాలా ఏళ్లు అయ్యిందని, పిల్లల భవిష్యత్ కోసమే తామిద్దరం ఒక ఒప్పందానికి వచ్చామంటూ చెప్పుకొచ్చారు. తన పిల్లల జీవనం, చదువు కోసం ఆలియాకు చాలా డబ్బు ఇస్తున్నా కూడా ఆమె కావాలనే ఇలా ఆరోపణలు చేస్తోందంటూ వివరించారు.
ఈ పరిణామాల మధ్య సడెన్ ట్విస్టు ఇచ్చింది ఆలియా. తన భర్తతో విడిపోయిన ఆలియా మళ్లీ కలిసి ఉంటోందని తెలిసింది. తన 14వ వివాహ వార్షికోత్సవానికి సంబంధించిన ఓ వీడియోను ఆమె షేర్ చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ జంట కలిసి ఉంటోందని, ఆలియా తన పిల్లలతో తిరిగి తన భర్త నవాజుద్ధీన్ దగ్గరకు వెళ్లిపోయిందన్న వార్తలు బీటౌన్‌లో వినిపిస్తుున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ బీటౌన్ హాట్ టాపిక్‌గా మారింది.
ఇకపోతే ముంబయిలో రీసెంట్గా రూ. 50కోట్లతో ఓ బంగ్లా కొని హాట్‌టాపిక్‌గా నిలిచారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.