Anant Ambani Radhika Merchant Sangeeth:దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం (జులై 5) ముంబయి జియో సెంటర్లో సంగీత్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్లో మొదట అంబానీ ఫ్యామిలీ డ్యాన్స్ చేసింది. ఆకాశ్ అంబానీ, ఇషా, నితా అంబానీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు.
సెలబ్రిటీల సందడి:సంగీత్ ఈవెంట్‌కు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు హాజరై సందడి చేశాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ సంగీత్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇక జాన్వీ కపూర్, రిచా సిన్హా, సారా అలీఖాన్, అనన్య పాండే, నేహ శర్మ, ఆయేషా శర్మ, దిశా పటానీ హాజరయ్యారు.
కపుల్స్ హంగామా: అనంత్- రాధిక సంగీత్ ఈవెంట్లో బాలీవుడ్‌కు చెందిన క్యూట్ కపుల్స్ కూడా పాల్గొని డ్యాన్స్ చేశారు. రణ్‌బీర్ సింగ్- ఆలియా భట్, కియారా అడ్వాణీ- సిద్ధార్థ్ మల్హోత్రా, జెనీలియా- రితేశ్ దేశ్‌ముఖ్, కాజల్- గౌతమ్ కిచ్లు, రకుల్‌ప్రీత్ సింగ్- జాకీ భగ్నానీ, అట్లీ- ప్రియా, అర్జున్ కపూర్- మీరా సందడి చేశారు.
అనంత్‌తో సల్మాన్ స్టెప్పులు:బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి కొడుకు అనంత్ అంబానీతో కలిసి స్టెప్పులేశారు. మరోవైపు జాన్వీ కపూర్‌తో అర్జున్ కపూర్ చిందులేశారు. వీరిద్దరూ లైవ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు.