Bigg Boss Telugu 8 :గత ఏడాది అంతా "ఉల్టా పుల్టా" అంటూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ షో.. ఇప్పుడు ఎనిమిదో సీజన్ కు సిద్ధమవుతోంది. అతి త్వరలోనే ఈ సీజన్ మొదలు కానుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ ఫస్ట్ లేదా 8వ తేదీన.. ఈ 8వ సీజన్ స్టార్ట్ అవుతుందని టాక్. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సారి బిగ్ బాస్‌లోకి వీళ్లే ఎంట్రీ ఇస్తున్నారంటూ చాలా మంది సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. తాజాగా ఓ టాలీవుడ్ హీరో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ జోరుగా చర్చ సాగుతోంది! ఇంతకీ ఆ హీరో ఎవరో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇప్పటికే బిగ్‌బాస్ సీజన్ 8కి సంబంధించి టీజర్, ప్రోమో రిలీజ్ కాగా.. దానికి ఆడియన్స్ నుంచి ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత నుంచి బిగ్ బాస్‌కు సంబంధించి బయటకు వచ్చే ఏ న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ నడిచిన 7 సీజన్లన్నీ సింగిల్ హౌస్‌లో కొనసాగాయి. అయితే.. ఈసారి రెండు ఇళ్లలో ఆట నడుస్తుందని అంటున్నారు. ఇక, కంటిస్టెంట్స్ గురించి అయితే రోజుకో న్యూస్ బయటకు వస్తోంది.
సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్..
బిగ్‌బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇచ్చేది వీళ్లే అంటూ ఓ లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లిస్టులో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో.. నయని పావని, వింధ్య విశాఖ, జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, అమృతా ప్రణయ్, రీతూ చౌదరి, కుమారీ ఆంటీ, బర్రెలక్క, యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ, నటి సోనియా సింగ్, హీరోయిన్ కుషితా కల్లపు, సురేఖ వాణితోపాటు ఆమె కూతురు సుప్రిత తదితరులు ఉన్నారు.