తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: కొంత గోల - కొన్ని కన్నీళ్లు - ఫస్ట్​ వీక్​ నామినేట్ అయింది వీళ్లే! - Bigg Boss Season 8 Nominations List

Bigg Boss Season 8: బిగ్​బాస్​ సీజన్​ 8లో ఫస్ట్​వీక్​ నామినేషన్లు పూర్తయ్యాయి. రెండు రోజులపాటు సాగిన ఈ ప్రక్రియలో కంటెస్టెంట్స్​ మధ్య మాటల యుద్ధమే నడిచింది. మరి, మొదటివారం ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు నామినేట్​ అయిన కంటెస్టెంట్స్​ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.

Bigg Boss Season 8
Bigg Boss Season 8 (ETV Bharat)

By ETV Bharat Entertainment Team

Published : Sep 5, 2024, 10:54 AM IST

Bigg Boss Season 8 Nominations List: బిగ్‌బాస్ నామినేషన్లు అంటే ఆడియన్స్‌కి వచ్చే ఊపు అంతా ఇంతా కాదు. ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారోనని ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఈ సీజన్ 8లో ఫస్ట్​ వారం నామినేషన్ల ముచ్చట చూస్తే.. కాస్త హాట్​గా, కాస్త చప్పగా సాగాయి. ముఖ్యంగా నామినేషన్లు అంటే గొడవపడతారని అందరూ అనుకుంటే.. దానికి రివర్స్​ అయింది. ఇంతకీ మూడో రోజు హౌజ్​లో ఏం జరిగింది..? నామినేట్​ అయిన కంటెస్టెంట్స్​ ఎవరో ఇప్పుడు చూద్దాం..

బిగ్‌బాస్ సీజన్ 8లో సోమవారం రోజు ఇంటికి ముగ్గురు చీఫ్​లు ఎన్నిక కాగా.. మంగళవారం నుంచి నామినేషన్​ ప్రక్రియ స్టార్ట్​ అయ్యింది. బుధవారం కూడా అదే నామినేషన్ల ప్రక్రియను కంటిన్యూ చేశాడు బిగ్‌బాస్. ముందుగా ఆదిత్య ఓం వచ్చి పృథ్వీని క్లీనింగ్ విషయంలో, శేఖర్ బాషా లేజీగా ఉన్నాడంటూ నామినేట్ చేశాడు. ఇక వీరిలో పృథ్వీని సేవ్ చేసి బాషాను నామినేట్​ చేశారు చీఫ్స్. ఇక తర్వాత కిరాక్ సీత.. ప్రేరణ అన్న కొన్ని మాటలు నచ్చలేదంటూ తన మొదటి నామినేషన్ వేసింది. తర్వాత కుక్కర్ విషయంలో బేబక్కను నామినేట్ చేసింది. ఇక వీరిలో ప్రేరణను సేవ్ చేసి.. బేబక్కన నామినేట్​ చేసింది చీఫ్ నైనిక.

ఇక తర్వాత అభయ్ మొదటిగా మణికంఠను నామినేట్ చేశాడు. వీరిద్దరి మధ్య కొద్దిసేపు హీట్​ డిస్కషన్​ జరిగింది. ఇక తన రెండో నామినేషన్ బేబక్కకి వేశాడు అభయ్. వీరిద్దరిలో మణికంఠను నామినేట్ చేసింది యష్మీ.

ఆ తర్వాత విష్ణుప్రియ.. శేఖర్ బాషా కాస్త లేజీగా ఉన్నారంటూ నామినేట్ చేసింది. అలానే కుక్కర్ విషయంలో బేబక్క తప్పు లేకుండా గొడవ పెట్టుకున్నావంటూ సోనియాను నామినేట్ చేసింది. దీనికి కాసేపు సోనియా గొడవేసుకుంది. ఇక వీరిలో శేఖర్‌‌ను నామినేట్ చేస్తూ యష్మీ డెసిషన్ తీసుకుంది.

బిగ్​బాస్​: మొదలైన నామినేషన్ల పర్వం - నాగమణికంఠ వర్సెస్​ శేఖర్​ బాషా - కుక్కతో పోల్చుతూ!

ఏడ్చేసి.. ఏడిపించిన మణికంఠ: ఇక్కడ వరకు ఓ మాదిరిగా జరిగిన.. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. మణికంఠ పెద్దగా ఎవరితోనూ కలవడం లేదు.. గొడవ పెట్టుకోవడంపై పెట్టిన కాన్సట్రేషన్.. అందరితో కలవడానికి పెట్టుకుంటే బావుండేది అంటూ నామినేట్ చేసింది ప్రేరణ.. అలానే ఇంకొన్ని పాయింట్లు కూడా చెబుతుంటే.. మణికంఠ ట్యాప్ తిప్పడం మొదలెట్టాడు. "నేను ఒక్కో పాయింట్‌కి ఆన్సర్ చేస్తా అండి.. నాకు అంత జ్ఞాపకశక్తి లేదండి.. నా పేరామీటర్ అయిపోయింది.. 7వ తరగతి నుంచి నానా కష్టాలు పడ్డా, నాన్నను పోగొట్టుకున్నాను.. స్టెప్ ఫాదర్ చేత అవమానాలు పడ్డా.. అమ్మ చనిపోయింది.. అమ్మ శవాన్ని కాల్చడానికి కట్టెల కోసం అడుక్కున్నా.. నా భార్య దూరమైంది.. నా కూతుర్ని దూరం చేస్తుంది.. అంటూ తెగ ఏడ్చాడు మణి.

దీంతో అమ్మాయిలందరూ ట్యాప్ తిప్పేశారు. ప్రేరణ, యష్మీ, నైనిక, విష్ణుప్రియ అందరూ ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా చీఫ్‌ యష్మీ అయితే సీట్లో కూర్చొని వెక్కివెక్కి ఏడ్చేసింది. మరి ఇప్పుడైనా ఓపెన్ అయ్యారు కదా ఇక నుంచి అయినా మాతో ఫ్రెండ్ షిప్ చేయండి అంటూ ప్రేరణ అంటే.. దానికి మణికంఠ.. "నేను ఎవరినీ నమ్మలేను.. మనుషుల మీద, మానవత్వం మీదే నాకు నమ్మకం పోయింది" అంటూ ఏడుస్తూనే ఉన్నాడు మణి.

ఇక మణికంఠ తన మొదటి నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు. వీరిద్దరి మధ్య కాసేపు డిస్కషన్​ జరిగింది. ఇక తర్వాత తన రెండో నామినేషన్ శేఖర్ బాషాకి వేశాడు మణికంఠ. వీళ్లిద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుంటే.. "ఎవడికి లేదయ్యా ఫ్లాష్ బ్యాక్.. ఓ వచ్చి ఏడ్చేసి.. దాన్ని నుంచి సింపథీ తెచ్చేసుకొని.. పాలిటిక్స్ క్రియేట్ చేస్తున్నావ్" అంటూ ఫైర్ అయ్యాడు శేఖర్ బాషా. ఇక వీరిద్దరిలో శేఖర్ బాషాను సేవ్ చేసి విష్ణును నామినేట్ చేసింది యష్మీ.

పృథ్వీ.. బేబక్కను మొదటిగా నామినేట్ చేయగా.. తర్వాత మణికంఠను చేశాడు. "నాకు పిరికివాళ్లు నచ్చరు.. దేనికైనా ఇలా ఏడ్చే వాళ్లు అసలే నచ్చరు.. నువ్వు సింపథీ గేమ్ ఆడుతున్నావ్.. నువ్వు ఓ నెగెటివ్ పర్సన్" అంటూ నామినేట్ చేశాడు పృథ్వీ. ఇక వీరిలో మణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది నైనిక. దీంతో నామినేషన్​ ప్రక్రియ పూర్తి కాగా.. మొత్తంగా ఈ వారం ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. వారెవరంటే..

  • సోనియా
  • బేబక్క
  • శేఖర్ బాషా
  • విష్ణుప్రియ,
  • పృథ్వీ
  • మణికంఠ

బిగ్​బాస్​ 8: తొలిరోజే మొదలైన రచ్చ - సోనియా వర్సెస్​ శేఖర్​ బాషా! ప్రోమో చూసేయండి!

బిగ్​బాస్​​ 8: తొలిరోజే కంటెస్టెంట్స్​ మధ్య వార్​ - కెప్టెన్​ ప్లేస్​లో ముగ్గురు చీఫ్​లు! డే 1 హైలెట్స్​ ఇవే!

ABOUT THE AUTHOR

...view details