తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిగ్​బాస్​​ 8: తొలిరోజే కంటెస్టెంట్స్​ మధ్య వార్​ - కెప్టెన్​ ప్లేస్​లో ముగ్గురు చీఫ్​లు! డే 1 హైలెట్స్​ ఇవే! - Bigg Boss Season 8 Day 1 Highlights - BIGG BOSS SEASON 8 DAY 1 HIGHLIGHTS

Bigg Boss Season 8: బిగ్‌బాస్ అంటేనే మైండ్​ గేమ్​లు, సింపథీలు, టాస్క్​లు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్​ పెద్దదే. తాజాగా మొదలైన సీజన్ 8 తొలిరోజు బిగ్‌బాస్ ఇంట్లో ఏం జరిగింది? టాస్కుల్లో ఎవరు గెలిచారు? మాటల యుద్ధంలో ఎవరిది పైచేయి? అనే వివరాలపై ఓ లుక్కేయండి మరి..

Bigg Boss Season 8
Bigg Boss Season 8 Day 1 Highlights (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Sep 3, 2024, 10:46 AM IST

Bigg Boss Season 8 Day 1 Highlights:బిగ్‌బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంఛ్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్లు అందరూ మాటలు మొదలుపెట్టారు. ఒకప్పటి హీరో ఆదిత్య ఓం.. నాగమణికంఠ దగ్గరికొచ్చి సారీ చెప్పాడు. "ఎవరిని హౌజ్​ నుంచి బయటికి పంపాలంటే నేను కావాలని నీ పేరు చెప్పలేదు" అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీనికి మణికంఠ.. వదిలేయండి ఫర్లేదంటూ సైడ్ అయ్యాడు. ఇక అక్కడే ఉన్న నిఖిల్​, మణికంఠ మధ్య కాసేపు డిస్కషన్ జరిగింది. "ఆదిత్య అన్న పెద్దోడు కదా నువ్వు అలా గౌరవం లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు" అంటూ నిఖిల్​ మాట్లాడాడు. దీనికి కాసేపు సైలెంట్‌గా ఉన్న మణికంఠ.. "ఏం చెప్పాలో, ఎలా ఆడాలో నాకు తెలుసు .. ఎవరి సలహాలు నాకు అక్కర్లేదు" అంటూ చెప్పేశాడు. దీంతో కాస్త రెయిజ్ అయిన నిఖిల్.. "ఓకే వదిలేసే అయినా అందరూ ఇక్కడికి కష్టపడే వచ్చారు.. నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు" అంటూ చెప్పాడు.

సోనియా వర్సెస్​ శేఖర్​: ఇక కాసేపటికీ శేఖర్ బాషా, మిగిలిన కొద్దిమంది ఇంటి సభ్యులు ఆరెంజెస్‌తో క్యాచ్‌లు ఆడుకోవడం మొదలెట్టారు. ఈ విషయంలో సోనియా ఆకుల.. "ఎవరు ఆరెంజెస్‌తో ఆడుతున్నారో వాళ్లెవరూ తర్వాత దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు.. అయినా ఫుడ్డుతో ఆటలేంటి" అంటూ క్లాస్ పీకింది. దీంతో శేఖర్ బాషా.. "బిగ్‌బాస్ రూల్స్‌లో ఫుడ్డుతో ఆడకూడదని ఎక్కడైనా ఉందా?.. అయినా ఆరెంజెస్‌తో ఆడకూడదని చెప్పడానికి నీకేం రూల్ ఉంది" అంటూ రివర్స్​ అయ్యాడు. దీనికి అంతే స్ట్రాంగ్‌గా రిప్లయ్ ఇచ్చింది సోనియా. "నీకు ఇచ్చిన ఫుడ్ నువ్వు కింద పడేసుకొని తిను, ఎక్కడైనా పడేసుకొని.. నువ్వు డ్రైనేజ్‌లో వేసుకొనైనా తిను.. నీ ఇష్టం అది.. ఎవరైతే మనుషుల్లాగ తిందామనుకుంటున్నారో వాళ్లకి మాత్రం ఇవి పెట్టకండి.." అంటూ ఇచ్చిపడేసింది.

ఇక దీనికి శేఖర్ బాషా కూడా తన స్టయిల్లో వాదించాడు. "ఇదేమైనా దేశ జెండానా.. దీనికి అంత గౌరవం ఇవ్వడానికి" అంటూ ఏదేదో మాట్లాడాడు. ఫుడ్ అంటే అంతకంటే ఎక్కువే అంటూ మరో పంచ్ ఇచ్చింది సోనియా. అంటే "ఇప్పుడు కింద పడిన దాన్ని తింటున్న నేను పశువునా.. నేను మనిషిని కాదా" అంటూ చేతిలో ఉన్న ఆరెంజ్‌ను చకచకా తినేశాడు శేఖర్ బాషా. అయితే ఈ డిస్కషన్ అయిన కాసేపటికే సోనియా దగ్గరికెళ్లి నవ్వుతూ మాట్లాడాడు శేఖర్.

బిగ్​బాస్​ 8: తొలిరోజే మొదలైన రచ్చ - సోనియా వర్సెస్​ శేఖర్​ బాషా! ప్రోమో చూసేయండి!

నో కెప్టెన్​.. బట్​:ఇక ఈసారి హౌజ్​కి కెప్టెన్లు లేరంటూ ముందే క్లారిటీ ఇచ్చిన బిగ్‌బాస్.. కెప్టెన్లు కాకుండా ఆ ప్లేస్‌లో ముగ్గురు చీఫ్‌లు ఉంటారంటూ షాకిచ్చాడు. ఇక సీజన్ గ్రాండ్ లాంఛ్ టైమ్‌లో విన్ అయిన మూడు జంటలకి ఫస్ట్​ టాస్కు ఇచ్చాడు బిగ్‌బాస్ . "పట్టుకొని ఉండండి" అంటూ పెట్టిన ఈ టాస్క్ ప్రకారం.. ఒక కేజ్‌లో రంగు రంగుల బెల్ట్​లు ఉన్నాయి. వాటిని ఎక్కువసేపు పట్టుకోవాల్సి ఉంటుంది. అయితే పట్టుకున్న వాళ్ల బెల్ట్​ను స్పిన్నింగ్ వీల్‌లో వచ్చే కలర్ బట్టి కట్ చేస్తుంటారు. చివరి వరకూ ఎవరు ఉంటారో వాళ్లే విన్నర్. ఇక ఈ ఆటలో బేబక్క, యష్మీ గౌడ, నబీల్, నిఖిల్, నైనిక, శేఖర్ బాషా పాల్గొని.. చివరి వరకూ నిలబడిన నిఖిల్ విన్నర్ కావడంతో హౌస్‌కి మొదటి చీఫ్ అయిపోయాడు.

ఇక మొదటి టాస్కులో ఓడిపోయిన ఐదుగురు కంటెండర్లకి మరో ఛాన్స్​ ఇచ్చాడు బిగ్‌బాస్. కోన్ గేమ్ అంటూ పెట్టిన రెండో టాస్కులో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది నైనిక. ఈ టాస్కులో గెలిచి హౌస్‌కి రెండో చీఫ్ అయిపోయింది. అయితే ఈ టాస్కుకి కిరాక్ సీత సంచాలక్‌గా చేసింది. ఆ సమయంలో తనని పక్కకెళ్లి ఆడుకో అంటూ నిఖిల్ అనడం తనకి నచ్చలేదంటూ గేమ్ అయిపోయిన తర్వాత సీత.. మణికంఠతో చెప్పింది.

సోనియా వర్సెస్​ యష్మీ:ఇక మిగిలిన నలుగురిలో ఒకరిని చీఫ్‌గా సెలక్ట్ చేయాలంటూ అప్పటికే చీఫ్‌లు అయిన నిఖిల్, నైనికలను కోరాడు బిగ్‌బాస్. ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అయింది. అయితే యష్మీని చీఫ్‌గా సెలక్ట్ చేద్దామంటూ నైనికతో అన్నాడు నిఖిల్​. నైనిక మాత్రం నబీల్ బాగా ఆడాడంటూ చెప్పింది. కానీ కన్విన్స్ చేసేసి మరీ సింపుల్‌గా యష్మీని సెలక్ట్ చేయించేశాడు నిఖిల్. ఇక తనని చీఫ్‌గా సెలక్ట్ చేయడంపై యష్మీ మాట్లాడుతూ.." నేను సరిగా టాస్కులో పెర్ఫామ్ చేయలేదు.. కానీ నాలో ఏం చూసి మీరు నన్ను సెలక్ట్ చేశారో నాకు తెలీదు.. కానీ మీరు మాత్రం 100కి 100 శాతం చీఫ్‌లుగా ఉండటానికి అర్హులని ఈ నిర్ణయంతో తెలిసింది. ఇదంతా నా అదృష్టం ఏమో" అంటూ చెప్పుకొచ్చింది. తను సరిగా ఆడలేదని తనే ఒప్పుకున్నా కూడా యష్మీని చీఫ్‌గా ఎలా సెలక్ట్ చేశారంటూ వాయిస్​ వినిపించింది సోనియా ఆకుల. తనకంటే అన్ని విధాలా టాస్కుల్లో, మాట్లాడటంతో అన్నింట్లో నబీల్ బెస్ట్ అంటూ సపోర్ట్ చేసింది.

యష్మీ అసలు చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించింది. చాలా విషయాల్లో ఆమె కంటే నబీల్ బెస్ట్ అంటూ వాయిస్ రెయిజ్ చేసింది సోనియా. దీంతో తన గురించి ఎందుకు లాగుతన్నావంటూ యష్మీ కూడా గొడవకి దిగింది. కానీ యష్మీ వైపు చూడకుండా నిఖిల్, నైనికలకి పాయింట్ టూ పాయింట్ ఇచ్చిపడేసింది సోనియా ఆకుల. చీఫ్ అంటే ఏదో అదృష్టం వల్ల ఇవ్వడం కాదు ఎవరు అర్హులో వాళ్లకి ఇవ్వాలి.. ఇక్కడ ఫ్రెండ్ షిప్‌ను చూడటం కరెక్ట్ కాదంటూ మాట్లాడింది. ఇలా తొలిరోజు నిఖిల్, నైనిక, యష్మీలు చీఫ్‌లు అయి పవర్ సాధించారు.

బిగ్​ బాస్​ 8లో "డబుల్ ధమాకా" - ఇప్పటి వరకూ చూడని సరికొత్త ఎలిమెంట్​ చూపిస్తారట!

బిగ్​బాస్ బ్యూటీ "శోభా శెట్టి" లవర్ ఇతనా! "కార్తీక దీపం" సీరియల్‌ నుంచే ప్రేమాయణం!!

ABOUT THE AUTHOR

...view details